హోమ్ /వార్తలు /technology /

OTT News: త్వ‌ర‌లో డిస్నీ+హాట్‌స్టార్ నుంచి కొత్త ప్లాన్ వచ్చే చాన్స్‌.. ఎక్కువ మంది యూజ‌ర్లే టార్గెట్‌!

OTT News: త్వ‌ర‌లో డిస్నీ+హాట్‌స్టార్ నుంచి కొత్త ప్లాన్ వచ్చే చాన్స్‌.. ఎక్కువ మంది యూజ‌ర్లే టార్గెట్‌!

OTT News | ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ కంపెనీ డిస్నీ+హాట్‌స్టార్ (Disney + Hotstar) ఇప్ప‌టికే యూజ‌ర్ల‌ను పెంచుకొనేందుకు ఎన్నో మార్కెటింగ్ ఆఫ‌ర్స్‌ను అందిస్తోంది. అయితే అటు ప్రైమ్‌, ఇటు నెట్‌ఫ్లిక్స్ పోటీ కార‌ణంగా ఎక్కువ యూజ‌ర్ల‌ను పొంద‌లేక‌పోతోంది. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్ నుంచి కొత్త ఆఫ‌ర్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  ప్రముఖ ఓటీటీ (OTT) స్ట్రీమింగ్ కంపెనీ డిస్నీ+హాట్‌స్టార్ (Disney + Hotstar) ఇప్ప‌టికే యూజ‌ర్ల‌ను పెంచుకొనేందుకు ఎన్నో మార్కెటింగ్ ఆఫ‌ర్స్‌ను అందిస్తోంది. అయితే అటు ప్రైమ్‌, ఇటు నెట్‌ఫ్లిక్స్ పోటీ కార‌ణంగా ఎక్కువ యూజ‌ర్ల‌ను పొంద‌లేక‌పోతోంది. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్ నుంచి కొత్త ఆఫ‌ర్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు డిస్నీ+ ప్రకటనలు లేకుండా వచ్చే స‌బ్‌స్క్రిప్ష‌న్‌ల‌ను అందించింది. త్వ‌ర‌లో యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌ను పరిచయం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ది 2022 చివరిలో అమెరికా (America) లో ప్రారంభమవుతుందని, 2023లో అంతర్జాతీయంగా విస్తరించే యోచనలో ఉందని కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

  Windows 11: అదిరిపోయే ఫీచ‌ర్స్‌.. అంత‌కు మించి యూజ‌ర్ ఫ్రెండ్లీ.. విండోస్ 11 ప్ర‌త్యేక‌త‌లు!

  స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ డిస్నీ+ ప్రకటనలు లేకుండా దాని ఎంపికతో పాటు యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌ను పరిచయం చేయడం ద్వారా వినియోగదారులు ఎక్కువ‌మంది ఆస‌క్తి చూపుతార‌ని సంస్థ భావిస్తోంది. FY24 నాటికి 230-260 మిలియన్ల డిస్నీ+ సబ్‌స్క్రైబర్‌ల దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించడానికి కంపెనీ ప‌లు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

  తెలుగు మార్కెట్ పెంచుకోవడానికి డిస్నీ ఎంతో ప్రయత్నం చేస్తుంది.  తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది.

  MWC 2022: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఫోల్డ‌బుల్ ఫోన్ సంద‌డి.. టాప్ ఫీచ‌ర్స్‌తో "హానర్ మ్యాజిక్ వి"

  అంతే కాకుండా జియో కస్టమర్లకు రీఛార్జ్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hostar) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. కొన్ని ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తే, ఇంకొన్ని ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. జియో ప్లాన్ రీఛార్జ్ చేసి ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. దీని ద్వారా  డిస్నీ ఎక్కువ యూజర్లను  సొంత చేసుకొంటూ మార్కెట్ పెంచుకొంటుంది.

  First published:

  ఉత్తమ కథలు