సాఫ్ట్ వేర్ సంస్థ సిల్లీ ట్రిక్.. మగవారికంటే ఆడవారికి తక్కువ శాలరీ

ఒరాకిల్ సంస్థ నల్లజాతీయులు, ఆసియా వారు, మహిళలకు తక్కువ వేతనాలు ఇచ్చిందంటూ అమెరికాలోని లేబర్ డిపార్ట్‌మెంట్ ‘లా సూట్’ ఫైల్ చేసింది.

news18-telugu
Updated: January 25, 2019, 7:41 PM IST
సాఫ్ట్ వేర్ సంస్థ సిల్లీ ట్రిక్.. మగవారికంటే ఆడవారికి తక్కువ శాలరీ
ప్రతీకాత్మక చిత్రం (Photo: REUTERS/Robert Galbraith/File Photo)
  • Share this:
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఒరాకిల్ సంస్థపై అమెరికాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ సంస్థ... మహిళలకు, నల్లవారికి, ఆసియా వారికి తక్కువ వేతనాలు చెల్లిస్తోందని ఆరోపించింది. దీనికి సంబంధించి ఈనెల 22న అమెరికాలోని ‘లా సూట్’ దాఖలు చేసింది. అంతేకాదు, తీసుకున్న వారికి తక్కువ వేతనాలు ఇస్తున్న సంస్థ.. ఇలాంటి ఎందరినో అసలు ఉద్యోగాల్లోకి కూడా తీసుకోవడం లేదని ఆరోపించినట్టు ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ వెబ్‌సైట్ కథనంలో పేర్కొంది.

#Jobs: ఐటీ, స్టార్టప్స్‌లో వచ్చే ఏడాది 5 లక్షల ఉద్యోగాలు | IT & startups expected to hire 5 lakh people in 2019: Mohandas Pai
ప్రతీకాత్మక చిత్రం


5000 మంది ఆడవారి జీతాలు, ఇతరుల వేతనాలను సరిపోలిస్తే మహిళా ఉద్యోగులకు కనీసం 20 శాతం తక్కువ జీతాలు ఇస్తున్నట్టు తమ పరిశీలినలో వెల్లడైనట్టు తెలిపింది. అదే సమయంలో 11,000 మంది ఆసియాకు చెందిన ఉద్యోగులకు కూడా కనీసం 8శాతం తక్కువగా జీతాలు ఇస్తున్నట్టు తెలిపింది.

job notifications, head constables in cisf, job application, జాబ్ నోటిఫికేషన్స్, సీఐఎస్ఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, జాబ్ అప్లికేషన్స్
ప్రతీకాత్మక చిత్రం


‘ఒరాకిల్ సంస్థ తమ ఉద్యోగులు, దరఖాస్తు చేసుకున్న వారి మీద ఓ క్రమబద్ధమైన లింగవివక్ష, జాతి విక్షను ప్రదర్శించింది.’ అని లేబర్ డిపార్ట్ మెంట్ పేర్కొన్నట్టు బ్లూమ్‌బర్గ్ సంస్థ తెలిపింది. ఇతర సంస్థల నుంచి తీసుకునే ఉద్యోగుల్లో కూడా కిందిస్థాయి ఉద్యోగాల్లో నియమిస్తోందని ఆరోపించింది.

best-place-for-employees
ప్రతీకాత్మక చిత్రం


గత నాలుగేళ్ల కాలంలో ఒరాకిల్ సంస్థ 500 మంది టెక్నికల్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటే, వారిలో కేవలం ఆరుగురు మాత్రమే ఆఫ్రికన్ అమెరికన్లు. అందులో అత్యధికంగా ఆసియాకు చెందిన వారే. ఎందుకంటే వారికి తక్కువ వేతనం ఇచ్చి రిక్రూట్ చేసుకుంది.
ప్రతీకాత్మక చిత్రం


స్టూడెంట్ వీసాల మీద అమెరికా వచ్చిన వారయితే, తాము ఇచ్చే స్కాలర్‌షిప్స్ కోసం, అమెరికాలో ఉండడం కోసం కంపెనీ చెప్పినట్టు నడుచుకుంటారన్న ఉద్దేశంతో ఏరికోరి వారినే రిక్రూట్ చేసుకున్నట్టు లేబర్ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది. అయితే, లేబర్ డిపార్ట్ మెంట్ దాఖలు చేసిన ‘లా సూట్‌’‌లో నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ ఒరాకిల్ సంస్థ కొట్టిపారేసింది.
First published: January 25, 2019, 7:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading