Viral Photo: ఈ షూ మీకు ఏ కలర్‌లో కనిపిస్తోంది?

Optical Illusion Shoe | ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫోటోకు 4 లక్షలకు పైగా కామెంట్స్, 4.3 లక్షలకు పైగా షేర్స్ రావడం విశేషం. ఈ ఫోటో ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో కూడా సర్క్యులేట్ అవుతోంది.

news18-telugu
Updated: May 10, 2019, 3:54 PM IST
Viral Photo: ఈ షూ మీకు ఏ కలర్‌లో కనిపిస్తోంది?
Viral Photo: ఈ షూ మీకు ఏ కలర్‌లో కనిపిస్తోంది? (image: Thoughts for life/facebook)
news18-telugu
Updated: May 10, 2019, 3:54 PM IST
ఇంటర్నెట్‌‌లో ఓ ఫోటో వైరల్ అవుతోంది. అది షూ ఫోటో. అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? మీరూ ఓసారి ఆ ఫోటో చూడండి. మీకు ఆ షూ ఏ కలర్‌లో కనిపిస్తుందో గమనించండి. వాస్తవానికి ఆ షూ మీకు కనిపించిన కలర్‌లో లేదు. మీకు ఒక కలర్‌లో కనిపిస్తే మరొకరికి ఇంకో కలర్‌లో కనిపించొచ్చు. ఈ షూ కలర్స్ రెండు కాంబినేషన్స్‌లో కనిపిస్తాయి. కొందరికి గ్రే అండ్ గ్రీన్ అంటే... బూడిద రంగు, ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఇంకొందరికి పింక్ అండ్ వైట్ అంటే గులాబీ రంగు, తెలుపు రంగులో కనిపిస్తుంది. ఇంకా మీకు డౌటా? అయితే ఈ ఫోటో చూడండి. నలుగురికి చూపించి ఏ కలర్‌లో కనిపిస్తుందో అడగండి.

కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఫోటో ఒకటి వైరల్ అయింది. ఓ డ్రెస్ కొందరికి గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్‌లో కనిపిస్తే, మరికొందరికి బ్లూ అండ్ బ్లాక్ కలర్స్‌లో కనిపించింది. ఇప్పుడు ఈ షూ ఫోటో వైరల్‌గా మారింది. ఇది ఆప్టికల్ ఇల్యూజన్. 'Thoughts for life' ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫోటోకు 4 లక్షలకు పైగా కామెంట్స్, 4.3 లక్షలకు పైగా షేర్స్ రావడం విశేషం. ఈ ఫోటో ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో కూడా సర్క్యులేట్ అవుతోంది. పింక్ అండ్ వైట్ కనిపించిన వారికి మెదడులో కుడి భాగం ఆధిపత్యాన్ని చూపిస్తుందని, గ్రీన్ అండ్ గ్రే కనిపించినవారికి మెదడులో ఎడమభాగం ఆధిపత్యం చూపిస్తుందని తేల్చారు నెటిజన్లు.

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:



Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Shock: కరెన్సీ నోట్లపై స్పెల్లింగ్ మిస్టేక్... తప్పెవరిది?

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
First published: May 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...