మెసేజింగ్ (Messaging)సేవలు అందించే ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన వాట్సాప్ (WhatsApp).. ఇప్పుడు ఎన్నో రకాల సేవలను(Services) అందిస్తోంది. మల్టీ-డివైజ్(Multi Devise) కంపాటబిలిటీతో పాటు మీ స్మార్ట్‌ఫోన్‌తో(Smartphone) సంబంధం లేకుండా వాట్సాప్ వెబ్‌లో(WhatsApp Web) చాట్స్ యాక్సెస్ చేసే లేటెస్ట్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో మరో కొత్త ఫీచర్‌పై కంపెనీ పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకేసారి రెండు మొబైల్ డివైజ్‌లలో ఒకే వాట్సాప్ అకౌంట్‌తో సైన్ అప్ అయ్యే అవకాశాన్ని కంపెనీ కల్పించనుంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం వాట్సాప్ ఈ సరికొత్త కంపానియన్ మోడ్‌ను (Companion mode) టెస్ట్ చేస్తోంది.
ఈ ఫీచర్ కోసం ప్రజలు ఎప్పటి నుంచో కంపెనీని అడుగుతున్నారు. ఇప్పుడు యూజర్ల కోరికను నిజం చేసేందుకు వాట్సాప్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సరికొత్త కంపానియన్ మోడ్‌తో యూజర్ ఒకే మొబైల్ నంబర్ సాయంతో రెండు డివైజ్‌లో వాట్సాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఒకేసారి ఇలా వాట్సాప్‌ను లింక్ చేసుకోవచ్చు.
రెండు డివైజ్‌లలో వేర్వేరు వాట్సాప్ అకౌంట్లు వాడాల్సిన అవసరం లేకుండా చేసే ఈ కొత్త ఫీచర్‌ను.. కంపెనీ ఆండ్రాయిడ్, iOS యాప్‌లలో టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను టిప్‌స్టర్లు షేర్ చేశారు. అయితే కంపానియన్ మోడ్ ఉపయోగించాలనుకుంటే.. సెకండరీ డివైజ్‌లో లాగిన్ అయిన తర్వాత, ఫస్ట్ డివైజ్‌లో వాట్సాప్ అకౌంట్ నుంచి యూజర్‌ను ఆటోమెటిక్‌గా లాగ్ అవుట్ చేస్తుందని స్క్రీన్‌షాట్లు స్పష్టంగా సూచిస్తున్నాయి.
అంతే కాదు, వేరే డివైజ్‌కు స్విచ్ అయినప్పుడు, ప్రైమరీ డివైజ్‌లో స్టోర్ అయిన అన్ని మెసేజ్‌లు, మీడియా ఫైల్స్ కూడా రిమూవ్ అవుతాయి. వాట్సాప్ ఇప్పటికే యూజర్లకు బ్యాకప్ ఆప్షన్‌ను అందిస్తోంది. గుగూల్ డ్రైవ్‌కు చాట్ లిస్ట్, ఫైల్స్‌ను బ్యాకప్ చేసే అవకాశాన్ని అందిస్తోంది. అవసరమైతే ఈ కొత్త ఫీచర్‌ను వాడే యూజర్లు కంటెంట్‌ను బ్యాకప్ చేసుకొని, డేటా డిలీట్ కాకుండా కాపాడుకోవచ్చు. ప్రైమరీ డివైజ్‌లో డేటా డిలీట్ అవ్వడంపై నెగిటివ్ కామెంట్లు వస్తాయని చెప్పవచ్చు.
ఎందుకంటే ఈ మోడ్ ద్వారా వేరే మొబైల్ డివైజ్‌కు యూజర్ స్విచ్ అయితే.. డేటా కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వాలనుకుంటారు. డేటా కోల్పోకుండా కంపానియన్ మోడ్‌ను అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందని నెటిజన్లు చెబుతున్నారు.లాంచ్ చేసే సమయానికి ఈ ఫీచర్‌లో వాట్సాప్ మార్పులు చేస్తుందని యూజర్లు ఆశిస్తున్నారు. ఎందుకంటే వాట్సాప్ ప్రస్తుతం ఈ కంపానియన్ మోడ్‌ను బీటా టెస్టింగ్ చేస్తోంది. పూర్తి స్థాయిలో దీన్ని పరీక్షించిన తర్వాత యూజర్ల అవసరాలు, రివ్యూల ప్రకారం ఫీచర్‌లో మార్పులు చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, New feature, New features, Whatsapp