హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oppo Phones: ఒప్పో ఫ్యాన్స్‌‌కి ముఖ్య గమనిక.. ఇకపై ఫోన్లతో పాటు ఛార్జర్లు రావు.. ఎప్పటి నుంచంటే..

Oppo Phones: ఒప్పో ఫ్యాన్స్‌‌కి ముఖ్య గమనిక.. ఇకపై ఫోన్లతో పాటు ఛార్జర్లు రావు.. ఎప్పటి నుంచంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Oppo Phones: ఒప్పో ఫోన్ ఫ్యాన్స్‌కి ముఖ్య గమనిక. ఇకపై ఫోన్లతో పాటు చార్జర్లు రావు. మరి ఇది ఎప్పటి నుంచో అమల్లోకి వస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Oppo Phones: కొన్నేళ్ల క్రితం వరకు స్మార్ట్‌ఫోన్ల (Smartphones) తయారీ కంపెనీలు ఫోన్ బాక్స్‌లో ఇయర్ ఫోన్స్, ఛార్జర్లు తప్పనిసరిగా ప్యాక్ చేసి వాటిని డెలివరీ చేసేవి. కానీ రీసెంట్ టైమ్స్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను ఇయర్స్ ఫోన్స్‌తో పాటు ఛార్జర్లు (Chargers) కూడా లేకుండా డెలివరీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు యాపిల్, శాంసంగ్ కంపెనీలు తమ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌తో పాటు మిడ్ రేంజ్ ఫోన్లకు కూడా ఛార్జర్లు ఇవ్వడం మానేశాయి. అయితే వీటిని చూసి చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి. Xiaomi ఇప్పటికే తన రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ (Redmi Note 11 SE)ని ఛార్జర్‌ లేకుండా లాంచ్ చేసి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒప్పో (Oppo) కూడా తమ కొన్ని సెలెక్టెడ్ ఫోన్ మోడళ్ల బాక్స్‌లలో ఛార్జర్లను ఇవ్వమని ప్రకటించింది. ఈ మోడల్స్ ఏంటనేది కంపెనీ వెల్లడించలేదు కానీ 2023 నుంచి కొన్ని ఫోన్లు ఛార్జర్లు లేకుండా (Without Charger) డెలివరీ అవుతాయని స్పష్టం చేసింది.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ రాబోతోంది.. ధర, ఫీచర్లు, లాంచింగ్, ఇతర వివరాలు.

పర్యావరణానికి మేలు

ఈ నిర్ణయం కొనుగోలుదారుల్లో అసంతృప్తిని మిగిల్చినా కార్బన్ ఉద్గారాలతో పాటు ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి, ముడి పదార్థాలను ఆదా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. యాపిల్ వంటి కంపెనీలు పర్యావరణాన్ని సంరక్షించడానికి ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నాయి. ఒప్పో కంపెనీ ఛార్జర్లను డెలివరీ చేయమని ప్రకటించింది కానీ దానికి గల కారణాన్ని మాత్రం ప్రకటించలేదు. నిజానికి ఒప్పో వంటి చైనీస్ బ్రాండ్లు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఛార్జర్లను అందిస్తుంటాయి. ఇలాంటివి బయట దొరకడం యూజర్లకు కష్టమే. ఈ ఫోన్లు USB పవర్ డెలివరీ వంటి ఛార్జింగ్ స్టాండర్డ్‌తో కూడా రావడం లేదు. అందువల్ల కొత్త ఛార్జర్ కొనుగోలు చేయడం తప్పనిసరిగా మారే అవకాశముంది.

KTM Duke Series: కొత్త లుక్ లో KTM Duke బైక్స్.. బడ్జెట్ ధరల్లో అందబాటులోకి..


వాస్తవానికి ఒప్పో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను తన ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌లో మాత్రమే అందిస్తుంది. ఇప్పటికే రెనో 8, రెనో 8 ప్రో వంటి ఫోన్స్‌లో 80W/150W SuperVOOC ఛార్జర్లు అందించింది. ఒకవేళ ఇలాంటి మొబైల్స్‌కు ఛార్జింగ్ అడాఫ్టర్స్ అందించకపోతే యూజర్లు కొత్తగా ఛార్జర్లను బయట కొనుగోలు చేయక తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో 15W, 30W, 40W వంటి ఛార్జర్లు వీటికి సపోర్ట్ చేయకపోవచ్చు. అయితే ఎంట్రీ-లెవల్, మిడ్-రేంజ్ ఫోన్లలో ఛార్జర్ అందించకపోతే ఎక్కువమంది యూజర్లకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. శాంసంగ్, యాపిల్ వంటి కంపెనీలు 45W లేదా 20W రేంజ్‌లోనే ఛార్జింగ్ సపోర్ట్‌ను తీసుకొస్తుంటాయి. దీనివల్ల ఒకే ఛార్జర్ పలు జనరేషన్ల ఫోన్లకు వాడటం సాధ్యమవుతుంది.

2023 నుంచి ఒప్పో ఫోన్స్‌తో ఛార్జర్లు రావు

ఒప్పో రెనో 8 సిరీస్‌ను యూరప్‌లో లాంచ్ చేస్తున్న సందర్భంగా ఛార్జర్ల గురించి ఒప్పో ఓవర్సీస్ సేల్స్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ బిల్లీ జాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 నుంచి కొన్ని ఫోన్ల బాక్స్‌లలో ఛార్జర్‌ను అందించమని.. ఇందుకు తమ వద్ద ఒక ప్లాన్ ఉందని బిల్లీ జాంగ్ చెప్పుకొచ్చారు. "సూపర్‌వూక్‌ (SuperVOOC) ఛార్జర్లు యూజర్లకు బయట దొరకడం అసాధ్యం కాబట్టి వాటిని బాక్స్‌లో అందించాల్సి ఉంటుంది. కానీ మేం బిజినెస్ యాక్టివిటీస్ పెంచుతున్నాం. వాటిలో భాగంగా ఛార్జర్లను బాక్స్ నుంచి తొలగించి స్టోర్‌లో విక్రయానికి అందుబాటులో ఉంచుతాం. దీనివల్ల యూజర్లు మా అధికారిక స్టోర్లలోనే ఛార్జర్లను కొనుగోలు చేసి తమ కొత్త ఫోన్లకు ఉపయోగించవచ్చు" అని బిల్లీ జాంగ్ పేర్కొన్నారు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Mobile phone, Oppo, Smart phone, Technology

ఉత్తమ కథలు