హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oppo Find N: ఒప్పో నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి (Video)

Oppo Find N: ఒప్పో నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి (Video)

Oppo Find N: ఒప్పో నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి

Oppo Find N: ఒప్పో నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి

Oppo Find N | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. మరో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ (Foldable Smartphone) ప్రపంచాన్ని ఆకట్టుకోనుంది. ఒప్పో నుంచి తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రానుంది. ఒప్పో ఫైండ్ ఎన్ విశేషాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

ఒప్పో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌ను మొదటిసారిగా రిలీజ్ చేయబోతోంది ఒప్పో. వచ్చేవారం ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మడతపెట్టే స్మార్ట్‌ఫోన్స్ (Foldable Smartphone) ఉన్నాయి. కానీ ఒప్పో నుంచి తొలిసారి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ వస్తుండటం విశేషం. ఒప్పో ఫైండ్ ఎన్ (Oppo Find N) పేరుతో ఈ మోడల్‌ను పరిచయం చేయబోతోంది. సాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 మోడల్‌కు ఒప్పో ఫైండ్ ఎన్ పోటీ ఇవ్వనుంది. INNO Day 2021 ఈవెంట్ డిసెంబర్ 14న ప్రారంభం కానుంది. రెండో రోజైన డిసెంబర్ 15న ఒప్పో ఫైండ్ ఎన్ మోడల్‌ను ఒప్పో ఆవిష్కరించనుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను ఒప్పో ట్వీట్ చేసింది.

ఒప్పో మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్ ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్స్‌తో వస్తుందని ఒప్పో ప్రకటించింది. అయితే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌తో వస్తుందా లేక స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో రిలీజ్ అవుతుందా అన్న స్పష్టత లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వర్టికల్ లేఅవుట్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. డిజైన్ సాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 లాగానే ఉంది. ఇందులో రీట్రాక్టబుల్ రియర్ కెమెరా ఉండటం విశేషం. అంటే ఫోటో క్లిక్ చేసే సమయంలో కెమెరా బయటకు వస్తుంది. ఎలాగో ఈ వీడియోలో చూడండి.

Moto G51: రూ.15,000 బడ్జెట్‌లో మోటో జీ51 రిలీజ్... ఫీచర్స్ ఇవే

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కోసం నాలుగేళ్లుగా కృషి చేస్తున్నామని ఒప్పో ప్రకటించింది. నాలుగేళ్ల పరిశోధన ఫలితమే ఈ స్మార్ట్‌ఫోన్ అని ఒప్పో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, వన్‌ప్లస్ ఫౌండర్ ప్రకటించారు. మొత్తం 6 జనరేషన్స్‌ని రూపొందించారు. మొదటి జనరేషన్ ఒప్పో ఫైండ్ ఎన్ 2018 లోనే తయారైనా కమర్షియల్ మార్కెట్లోకి లాంఛ్ చేయలేదు. మొత్తానికి ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది ఒప్పో.

Moto G51 vs Redmi Note 11T 5G: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్? తెలుసుకోండి

ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయన్న స్పష్టత లేదు. డిసెంబర్ 15న ఇన్నో డే 2021 ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ అధికారికంగా తెలియనున్నాయి. అయితే ఇప్పటికే ఆన్‌లైన్‌లో వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ అయిన ఇవాన్ బ్లాస్ ఒప్పో ఫైండ్ ఎన్‌కు సంబంధించిన డీటైల్స్ వెల్లడించారు. ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ కెమెరా, హోల్ పంచ్ డిస్‌ప్లే ఉండొచ్చని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్స్‌లో రానుంది.

First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oppo, Smartphone

ఉత్తమ కథలు