Home /News /technology /

OPPO SMART PHONES OPPO LATEST DECISION ON MOBILE PROCESSORS TO DEVELOP OWN TECHNOLOGY EVK

OPPO Smart Phones: థార్డ్ పార్టీ కంపెనీల‌కు బైబై.. మొబైల్ ప్రాసెస‌ర్‌ల‌పై ఒప్పో తాజా నిర్ణయం!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

OPPO Smart Phone | ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మోడ‌ల్స్‌తో మొబైల్ మార్కెట్ పెంచుకోవ‌డంలో ఒప్పొది ప్ర‌త్యేక స్థానం. తాజా ఒప్పో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకొంది. ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు శాంసంగ్‌, యాపిల్‌, గూగుల్‌ లాంటి దిగ్గజ టెక్‌ కంపెనీలకు పోటీగా ఒప్పో తన మొదటి మొబైల్‌ ప్రాసెసర్‌ను లాంచ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకొంది.

ఇంకా చదవండి ...
    ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మోడ‌ల్స్‌తో మొబైల్ మార్కెట్ పెంచుకోవ‌డంలో ఒప్పొది ప్ర‌త్యేక స్థానం. తాజా ఒప్పో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకొంది. ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు శాంసంగ్‌, యాపిల్‌ (Apple), గూగుల్‌ లాంటి దిగ్గజ టెక్‌ కంపెనీలకు పోటీగా ఒప్పో తన మొదటి మొబైల్‌ ప్రాసెసర్‌ (Mobile Processer) ను లాంచ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకొంది. ప్ర‌స్తుతం మార్కెట్‌ను శాసిస్తున్న ప్ర‌ముఖ కంపెనీల‌లో శాంసంగ్‌, యాపిల్‌, గూగుల్‌ సంస్థలు తమ సొంత మొబైల్‌ ప్రాసెసర్‌ చిప్‌లను తయారు చేసుకొంటున్నాయి. ఇకపై ఆ జాబితాతో ఒప్పో (OPPO) చేర‌నుంది. ఇప్పటి వ‌ర‌కు ఒప్పో క్వాలకం, మీడియాటెక్‌ సంస్థల ప్రాసెసర్లను ఉపయోగిస్తోంది.

    Smart Phone Tips: మీరు ఈ బ్రాండ్ ఫోన్‌లు వాడుతున్నారా.. ఎక్కువ కాలం వాడాలంటే ఈ విష‌యం తెలుసుకోండి

    ఇలా థర్డ్‌ పార్టీ కంపెనీలపై ఆధారపడకుండా తన మొదటి మొబైల్ ప్రాసెసర్‌ను తీసుకురావాలని ఒప్పో నిర్ణ‌యం తీసుకొంది. ఈ చిప్‌సెట్‌ను ఒప్పో 2024లో విడుదల చేయనున్నట్ల తెలుస్తోంది. ఇది శామ్‌సంగ్, యాపిల్, గూగుల్ (Google) వంటి కంపెనీలకు పోటీగా నిలుస్తుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒప్పో గత కొద్ది రోజులుగా ఈ అప్లికేషన్‌ ప్రాసెసర్‌పై పనిచేస్తోంద‌ని స‌మాచారం ఈ ప్రాసెసర్‌ పనులు 2023లో ప్రారంభమై ఒక్క ఏడాదిలో అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

    New Smart Phone: ఏప్రిల్‌లో ఒప్పో నుంచి కొత్త‌ఫోన్‌.. అదిరిపోయే ఫీచ‌ర్స్ ఇవే!

    ఈ వ్య‌వ‌హారంలో అత్యంత ఆస‌క్తిక‌ర అంశం యాపిల్‌కు చిప్స్‌ను సరఫరా చేస్తోన్న టీఎస్‌ఎంసీ చిప్‌ కంపెనీ ఒప్పో కస్టమ్‌ చిప్‌ను తయారుచేయనున్నటు​ మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఒప్పో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌(ఎన్‌పీయూ) చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీని సహాయంతో అధిక-నాణ్యత కల్గిన చిత్రాలను ప్రాసెస్ చేయడంలో ఉపయోగపడుతోంది.

    eSIM: రెండు సిమ్‌కార్డులు ఒక్క‌దాంట్లోనే.. ఆండ్రాయ‌డ్ 13 కొత్త వ‌ర్ష‌న్‌లో అదిరిపోయే ఫీచ‌ర్స్‌

    ముఖ్యంగా థర్డ్‌ పార్టీ (Third PartY) చిప్‌ సెట్స్‌ ఆధారపడకుండా సొంత చిప్‌ సెట్‌ను తయారుచేసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ లాభం ఉంటుంద‌ని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే శామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్లలో Exynos చిప్‌సెట్‌, యాపిల్‌ స్మార్ట్‌ఫోన్లలో ఏ-సిరీస్‌ను, గూగుల్‌ టెన్సార్‌ చిప్‌ సెట్‌లను క‌లిగి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చిప్‌ సెట్‌ తయారీలో భాగంగా ఓప్పో భారీ పెట్టుబడులను పెడుతున్న‌ట్టు మార్కెట్ వ‌ర్గాల్లో ప్ర‌చారం న‌డుస్తోంది. ఇప్పటి వ‌ర‌కు ఒప్పో క్వాలకం, మీడియాటెక్‌ సంస్థల ప్రాసెసర్లను ఉపయోగిస్తోంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Latest Technology, Mobile News, Oppo, Smart phones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు