Oppo Slide Phone : ఒప్పో నుంచి క్రెడిట్ కార్డు సైజ్‌లో స్లైడ్ ఫోన్, ఇండియాలో లాంచ్ ఎప్పుడు?

OPPO Slide Phone: ఒప్పో స్లైడ్ ఫోన్

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో (Oppo), జపనీస్ డిజైన్ స్టూడియో నెండో (Nendo )తో కలిసి స్లైడ్ ఫోన్ (Slide Phone), మ్యూజిక్ లింక్ (Music Links ) కాన్సెప్ట్ పరికరాల రూపకల్పనకు సన్నాహాలు చేస్తుంది.

  • Share this:
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో (Oppo), జపనీస్ డిజైన్ స్టూడియో నెండో (Nendo )తో కలిసి స్లైడ్ ఫోన్ (Slide Phone), మ్యూజిక్ లింక్ (Music Links ) కాన్సెప్ట్ పరికరాల రూపకల్పనకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు చైనాలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ డిజైన్ ఎక్స్‌పో (CIIDE) నాలుగో ఎడిషన్‌లో ఈ కాన్సెప్ట్‌ను  ప్రదర్శించింది. ఒప్పో రూపొందించనున్న 'స్లైడ్ ఫోన్' లో మూడు మడత తెరలు ఉంటాయి. వీటిని యూజర్ అభిరుచులకు అనుగుణంగా మల్టిపుల్ ఫార్మ్ ఫ్యాక్టర్స్‌లో ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు త్వరలోనే 'మ్యూజిక్ లింక్' అనే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ను కూడా పరిచయం చేయనుంది. ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్ మల్టిపుల్ టాస్క్‌లను చేస్తుంది. అంతేకాక, మనం దీనికి కనెక్ట్ చేసిన యాక్సెసరీని బట్టి ఇది పనిచేస్తుంది. ఈ రెండు పరికరాల రూపకల్పనపై ఒప్పో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకుంది. నూతన ఆవిష్కరణలకు వినియోగదారులకు అందించాలనే ఉద్దేశ్యంతో, ఎప్పటికప్పుడు పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ పరిమాణాలను కుదించేందుకు ఈ "స్లైడ్ ఫోన్" డివైజ్ను రూపొందిస్తున్నట్లు ఒప్పో తెలిపింది.

ఈ 'స్లైడ్ ఫోన్'తో వినియోగదారుడు ఫోన్ రూపాన్ని అవసరమైన విధంగా మార్చడానికి వీలుంటుంది. ఈ ఫోన్ పూర్తిగా ముడుచుకున్నప్పుడు, క్రెడిట్ కార్డ్ పరిమాణానికి సమానంగా ఉంటుంది. 'స్లైడ్ ఫోన్'లోని ప్రత్యేకమైన ట్రిపుల్-హింజ్ డిజైన్ మూడు మడత తెరల తో కూడిన ఏడు విభిన్న రూపాల డిజైన్ను చూపిస్తుంది. దీని పనితీరుపై ఒప్పో ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో పేర్కొన్న దాని ప్రకారం, 40 మి.మీ డిస్‌ప్లే గల మొదటి స్క్రీన్ నోటిఫికేషన్‌లను తనిఖీ చేయడం, కాల్ హిస్టరీ చెక్ చేయడం లేదా మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్ చేయడం వంటి పనుల కోసం ఉపయోగపడుతుంది. 80 మిల్లీ మీటర్ల డిస్‌ప్లే గల రెండవ స్క్రీన్ తెరుచుకున్నప్పుడు అది సెల్ఫీ కెమెరా డిస్ ప్లే గా ఉపయోగపడుతుంది. మూడవ స్క్రీన్ తెరుచుకున్నప్పుడు మొత్తం డిస్ ప్లే ప్రత్యక్షమవుతుంది. ఈ స్క్రీన్ గేమింగ్ (gaming), మల్టీ-టాస్కింగ్లే వీడియోలను చూడటానికి అనువుగా ఉంటుంది.



వైర్లెస్ ఇయర్ ఫోన్‌లో పనిచేసే ‘మ్యూజిక్ లింక్స్’ కాన్సెప్ట్..
మరోవైపు, ఒప్పో సంస్థ 'మ్యూజిక్- లింక్స్' అనే కొత్త కాన్సెప్ట్తో నూతన డివైజ్ను రూపొందించడానికి సిద్ధమవుతోంది. ఇది వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ వలే పనిచేస్తుంది. దీనిలో భాగంగా జపాన్కు చెందిన డిజైన్ స్టూడియో నెండోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ‘మ్యూజిక్ లింక్’ కాన్సెప్ట్ ఇయర్ ఫోన్స్ను వినియోగదారులు సులభంగా వారి జేబుల్లో పెట్టుకొని తీసుకెళ్లవచ్చు. అంతేకాక, వాటిని సులభంగా నెక్ బ్యాండ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా, ఇది నెక్‌బ్యాండ్ ఆధారిత వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లుగా చేస్తుంది. అంతేకాక, దీన్ని స్మార్ట్ వాచ్‌కు, ఛార్జింగ్ కేసుకు ఇరువైపులా కనెక్ట్ చేసుకోవచ్చు. వీటిని వైర్‌లెస్ స్పీకర్ పైన పెట్టి ఛార్జింగ్ కేస్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని వివిధ డివైజెస్ ద్వారా కూడా సులభంగా ఛార్జింగ్చే సుకోవచ్చు. అయితే, ఈ రెండు డివైజెస్ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయంపై మాత్రం ఒప్పో స్పష్టతనివ్వలేదు.
Published by:Ashok Kumar Bonepalli
First published: