స్మార్ట్ బ్రాండ్ ఒప్పో (OPPO) ఇండియన్ మార్కెట్ (Indian Market)లో వరుసగా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తోంది. ఇటీవల కాలంతో కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఇయర్‌బడ్స్ సూపర్ పాపులర్ అయ్యాయి. ఇవి తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో మరో ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ బ్రాండ్ నుంచి ఒప్పో ఎన్కో ఎయిర్ 3 టీడబ్ల్యూఎస్ బడ్స్ త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటివరకు ఒప్పో నుంచి వచ్చే సరసమైన TWS బడ్స్‌గా ఇవి నిలవనున్నాయి.
ఒప్పో ఇండియాలో రెనో 8T 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 3న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. అయితే దీంతోపాటు ఎన్కో ఎయిర్ TWS లైనప్‌లో ఎన్కో ఎయిర్ 3 టీడబ్ల్యూఎస్ (OPPO Enco Air 3 TWS) పేరుతో మరో కొత్త ఆడియో ప్రొడక్ట్‌ను లాంచ్ చేయనుంది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ద్వారా ఈ విషయం తెలుస్తోంది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ టీజ్ చేసింది. గత ఏడాది మార్చిలో వచ్చిన ఎన్కో ఎయిర్ 2కి సక్సెసర్‌గా ఎన్కో ఎయిర్ 3 రానుంది.
* ధర ఎంత?
ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ఇయర్‌బడ్స్ టీజర్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇవి బడ్జెట్ రేంజ్‌లో లాంచ్ కానున్నాయి. ఈ TWS ప్రొడక్ట్‌కు “మ్యూజిక్ ఆల్ ఎరౌండ్” అనే ట్యాగ్‌లైన్ ఉంది. పనితీరు, బ్యాటరీ, డిజైన్ పరంగా ఇది ఆల్‌రౌండ్ ప్రొడక్ట్ అని కంపెనీ టీజర్‌లో పేర్కొంది. ఒప్పో బడ్స్ ఎయిర్ 2 TWS ధర రూ. 2,499గా ఉంది. ఈ సిరీస్ నుంచి వస్తున్న నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్ట్ బడ్స్ 3 కూడా అదే రేంజ్‌లో ఉండవచ్చు.
* ఫీచర్లు, ప్రత్యేకతలు
ఎన్కో ఎయిర్ 3 ఇయర్‌బడ్స్‌లో ఆడియోఫైల్-గ్రేడ్ ఆడియో ప్రాసెసింగ్ కోసం TWS Hi-Fi 5 DSPని ఉపయోగించారు. ఇవి సరికొత్త టాప్ ఎండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్‌తో వస్తాయి. దీని ప్రాసెసింగ్ పవర్ 25 రెట్లు మెరుగ్గా ఉంటుంది. తద్వారా మెరుగైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ బడ్స్ హాఫ్ ఇన్ ఇయర్ స్టైల్ డిజైన్‌లో రానున్నాయి.
ఇది కూడా చదవండి : Foldable iPad: యాపిల్ నుంచి త్వరలో ఫోల్డబుల్ ఐప్యాడ్.. లాంచ్ ఎప్పుడంటే..
గేమింగ్ లవర్స్‌కు ఇవి బెస్ట్ ప్రొడక్ట్‌గా నిలవనున్నాయి. గేమింగ్ కోసం 47ms అల్ట్రా-లో లేటెన్సీ, కాల్స్ కోసం DNN నాయిస్ క్యాన్సిలేషన్, IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్.. వంటి స్పెసిఫికేషన్లు దీని సొంతం. ఈ థర్డ్ జనరేషన్ TWS ఇయర్‌బడ్స్ బ్యాటరీ కెపాసిటీ కూడా గత ప్రొడక్ట్స్‌తో పోలిస్తే కాస్త పెరిగింది. ఎన్కో ఎయిర్ 3ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 31 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ సిరీస్‌లోని ఎన్కో ఎయిర్ 2 కంటే ఇది 7 గంటలు ఎక్కువ కావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.