OPPO Reno: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఒప్పో రెనో

OPPO Reno 10x zoom | ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫోటోలు తీయగలగడానికి కారణం అల్ట్రా నైట్ మోడ్ 2.0.

news18-telugu
Updated: June 10, 2019, 4:12 PM IST
OPPO Reno: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఒప్పో రెనో
OPPO Reno: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఒప్పో రెనో (image: OPPO)
  • Share this:
పెద్దదైన డిస్‌ప్లే, స్వచ్ఛమైన వీక్షణ, భారీ బ్యాటరీ, కట్టింగ్ ఎడ్జ్ 10x హైబ్రిడ్ జూమ్ కెమెరా సామర్థ్యాలతో OPPO రెనో 10x జూమ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను స్వాధీనం చేసుకుంది. ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజా సమర్పణ రెనో 10x జూమ్ ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రగతి చూపిస్తోంది. ఫోటోగ్రఫీ, మొబైల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొత్త ఎత్తుకు పెంచడానికి భరోసా ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 10x హైబ్రిడ్ జూమ్ టెక్నాలజీ, ప్రపంచంలోని మొట్టమొదటి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండటం విశేషం. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో విప్లవంగా ప్రచారం చేయబడిన OPPO రెనో 10x జూమ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ సాధిస్తోంది. భారతదేశంలో తాజా, స్వచ్ఛమైన, ఇంకా వైవిధ్యంగా రూపొందించిన రెనో 10x జూమ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో పోటీదారులను ఓడించింది.

ఫోటో- ఫినిష్ విజయం


10x హైబ్రిడ్ జూమ్ OPPO మంచి సక్సెస్ సాధించింది. వెనుక ప్రధాన కెమెరా మాడ్యూల్‌లో మూడు లెన్స్‌లు ఉన్నాయి. ప్రాథమిక కెమెరా OIS , PDAF తో 48-మెగాపిక్సెల్ IMX586 f / 1.7 సెన్సార్ కలిగి ఉండగా, 13 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 10x హైబ్రిడ్ జూమ్ ఇంకా 60X వరకు డిజిటల్ జూమ్ ఫోటోలు తీయడానికి వీలుంటుంది. చివరగా, ఒక 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్- యాంగిల్ కెమెరా పూర్తి మూడింతల - కెమెరా వ్యవస్థను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫోటోలు తీయగలగడానికి కారణం అల్ట్రా నైట్ మోడ్ 2.0. రాత్రి పూట ఫోటోను AI ఇమేజ్ ఆప్టిమైజేషన్ ద్వారా మీరు ఎంచుకున్న ఆబ్జెక్ట్‌కు, బ్యాక్‌గ్రౌండ్‌కు మధ్య తేడా స్పష్టంగా చూడొచ్చు. స్కిన్ కలర్‌లో తేడా లేకుండా ప్రొఫెషనల్ ఫోటో తీయగలదు. ఈ స్మార్ట్‌ఫోన్ సులభంగా ప్రొఫెషనల్ ఫోటోలను తీయగలదు. 5 అద్భుతమైన సెట్టింగ్స్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా అద్భుతంగా ఉంటుంది. కేవలం 0.8 సెకన్లలో 11 డిగ్రీల కోణంలో సెల్ఫీ కెమెరా పైకి వస్తుంది.

OPPO Reno release, OPPO Reno india release, OPPO Reno smartphone, OPPO Reno price, OPPO Reno features, OPPO Reno specifications, OPPO Reno 10 X Zoom, OPPO Reno 10 X camera, best camera phones, ఒప్పో రెనో స్మార్ట్‌ఫోన్, ఒప్పో రెనో ధర, ఒప్పో రెనో ఫీచర్స్, ఒప్పో రెనో స్పెసిఫికేషన్స్, ఒప్పో రెనో 10 ఎక్స్‌ జూమ్‌, ఒప్పో రెనో 10 ఎక్స్‌ కెమెరా, బెస్ట్ కెమెరా ఫోన్
(image: OPPO)

బాక్స్‌లో ఏముంది?


OPPO రెనో 10x జూమ్ భారతదేశంలో జెట్ బ్లాక్, ఓషన్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+128 జీబీ ధర రూ.39,990 కాగా, 8జీబీ+256జీబీ ధర రూ.49,990. జూన్ 7 నుంచే సేల్ మొదలైంది.


చూడటానికి ఎలా ఉంది?

ఓ మృదువైన టచ్, సొగసైన షేప్, 3D కర్వ్ గ్లాస్‌తో అద్భుతంగా ఉంటుంది ఫోన్. రెనో 10x జూమ్ కెమెరా ఫ్లాష్ నుంచి బ్యాక్ కవర్ వరకు వస్తుంది. బెజెల్ లెస్ డిస్‌ప్లే, షార్క్ ఫిన్ ఎలివేట్ కెమెరా మరిన్ని ప్రత్యేకతలు. ధ్వని కోసం ఇయర్‌పీస్, లౌడ్‌స్పీకర్, డిస్‌ప్లే పైన చిన్న స్లాట్‌లో స్టీరియో స్పీకర్ ఉన్నాయి. 6.6 అంగుళాల FHD + డిస్‌ప్లే, అమొలెడ్ ప్యానెల్, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఉండటం మరో ప్రత్యేకత.

OPPO Reno release, OPPO Reno india release, OPPO Reno smartphone, OPPO Reno price, OPPO Reno features, OPPO Reno specifications, OPPO Reno 10 X Zoom, OPPO Reno 10 X camera, best camera phones, ఒప్పో రెనో స్మార్ట్‌ఫోన్, ఒప్పో రెనో ధర, ఒప్పో రెనో ఫీచర్స్, ఒప్పో రెనో స్పెసిఫికేషన్స్, ఒప్పో రెనో 10 ఎక్స్‌ జూమ్‌, ఒప్పో రెనో 10 ఎక్స్‌ కెమెరా, బెస్ట్ కెమెరా ఫోన్
(image: OPPO)

ఫోన్ లోపల ఎలా ఉంది?


ఫోన్ లోపల క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఉన్నాయి. 4వ జెనరేషన్ ఏఐ ఇంజిన్ ఇంటిగ్రేట్ చేశారు. 4,065mAh బ్యాటరీ రోజంతా పనిచేస్తుంది. ఇక ఒప్పో ప్రత్యేకత అయిన VOOC 3.0 స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ColorOS 6 + Android 9 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

గేమ్ స్టార్ట్స్...


ఫోటోలంటే ఇష్టపడేవారికి మాత్రమే కాదు... గేమర్స్‌ని కూడా ఆకట్టుకునే ఫోన్ ఇది. సిస్టమ్ లెవెల్ ఆప్టిమైజేషన్ సొల్యూషన్, హైపర్ బూస్ట్ గేమ్స్ ఆడేందుకు సపోర్ట్ చేస్తాయి. ఒప్పో సొంతగా రూపందించిన గేమ్ బూస్ట్, సిస్టమ్ బూస్ట్, యాప్ బూస్ట్ కూడా ఉన్నాయి. గేమ్ ఎక్స్‌పీరియన్స్, సిస్టమ్ స్పీడ్, యాప్ ఓపెనింగ్ స్పీడ్‌లో చాలా తేడా కనిపిస్తుంది. ప్రపంచంలోని TUV రైన్లాండ్ హై-పర్ఫార్మెన్స్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి ఫోన్ ఇదే. దాంతోపాటు థర్మల్ జెల్, గ్రాఫైట్ షీట్, కాపర్ పైప్ లిక్విడ్ కూలింగ్, ట్రై కూలింగ్ కంట్రోల్ ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది.

OPPO Reno release, OPPO Reno india release, OPPO Reno smartphone, OPPO Reno price, OPPO Reno features, OPPO Reno specifications, OPPO Reno 10 X Zoom, OPPO Reno 10 X camera, best camera phones, ఒప్పో రెనో స్మార్ట్‌ఫోన్, ఒప్పో రెనో ధర, ఒప్పో రెనో ఫీచర్స్, ఒప్పో రెనో స్పెసిఫికేషన్స్, ఒప్పో రెనో 10 ఎక్స్‌ జూమ్‌, ఒప్పో రెనో 10 ఎక్స్‌ కెమెరా, బెస్ట్ కెమెరా ఫోన్
(image: OPPO)

ఫోన్ ఎలా ఉందంటే...


ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్... టైటిల్‌కు తగ్గట్టుగా విలువైనది. చక్కగా డిజైన్ చేసిన, రూపొందించిన, ధర నిర్ణయించిన మంచి స్మార్ట్‌ఫోన్ ఇది. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లల్లో టాప్‌లో నిలుస్తూ గట్టి పోటీ ఇస్తోంది. ట్రిపుల్ కెమెరా సెటప్, ధర కారణంగా OPPO రెనో 10x జూమ్ మంచి ఛాయిస్.

OPPO Reno: 'ఒప్పో రెనో' 10x జూమ్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Jio Cricket: మై జియో యాప్‌లో క్రికెట్ కాంటెస్ట్... ఆడండి ఇలా

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఎందుకు అవసరమో తెలుసా?
First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు