చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పొ (Oppo), ఇండియా (India)లో ఎప్పటికప్పుడు బడ్జెట్, మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది. భారత మార్కెట్‌లో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న ఈ సంస్థ.. మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఒప్పొ రెనో 8T పేరుతో కొత్త డివైజ్‌ను ఫిబ్రవరి 3న లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీని ధర, స్పెసిఫికేషన్స్ చెక్ చేయండి.
* ధర ఎంత ఉండవచ్చు?
ఇటీవల లాంచ్ అయిన ఒప్పొ రెనో 8 ప్రో ధర రూ.45,999 కాగా, వెనిలా రెనో 8 ధర రూ.29,999గా ఉంది. తాజాగా రానున్న ఒప్పొ రెనో 8T ధర రూ. 30,000 కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఫిబ్రవరి 3న లాంచ్ కానున్న ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ , ఒప్పొ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ షైనీ గోల్డ్ కలర్ వేరియంట్‌లో లాంచ్ కానుంది. బ్లాక్ కలర్ వేరియంట్‌లో కూడా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
* డిజైన్, బ్యాటరీ, కెమెరా
ఒప్పొ రెనో 8T డిజైన్ కంపెనీ వెబ్‌సైట్‌లో బహిర్గతం అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో రెండు పెద్ద కటౌట్స్ ఉన్నాయి. ఒప్పొ రెనో 8 సిరీస్ యూనిబాడీ డిజైన్‌కి ఇది చాలా భిన్నంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108MP ప్రైమరీ కెమెరా, 67W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,800mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 15 నిమిషాల పాటు ఛార్జింగ్ చేస్తే 9 గంటల వీడియో స్ట్రీమ్ అందిస్తుంది.
* డిస్‌ప్లే
ఒప్పొ రెనో 8T డివైజ్.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల మైక్రో-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో ఉంటుంది. సెల్ఫీ కెమెరా, స్లిమ్ బెజెల్స్ కోసం డిస్‌ప్లేలో సెంట్రల్లీ-అలైన్డ్ హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది. డిస్‌ప్లే 93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. మొత్తానికి కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లేపై ఎక్కువ ఫోకస్ చేసింది.
ఇది కూడా చదవండి : OnePlus 11R: 25 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్.. 50 మెగాపిక్సెల్ కెమెరా.. ఫిబ్రవరి 7న వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్ లాంచ్
సాధారణంగా ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో 16 మిలియన్ కలర్స్ మాత్రమే కనిపించే ట్రెడిషనల్ 8-బిట్ కలర్ డిస్‌ప్లే ఉంటుంది. అయితే ఒప్పొ రెనో 8Tలో 10-బిట్ కలర్ సపోర్ట్‌తో ఫుల్-HD+ రిజల్యూషన్‌ను తీసుకొస్తున్నట్లు గతంలో కంపెనీ ప్రకటించింది. దీని డిస్‌ప్లే టెక్ 1 బిలియన్ కలర్స్‌ను ప్రదర్శిస్తుంది.
ఒప్పొ రెనో 8T ప్రమోషన్స్ కోసం కంపెనీ ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ఒప్పందం చేసుకుంది. రణ్‌బీర్ సెల్ఫీ తీసుకున్న తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను ఓ అభిమానికి విసురుతాడు. ఇందుకు సంబంధించిన "యాంగ్రీ రణ్‌బీర్ కపూర్" అనే హ్యాష్‌ట్యాగ్‌తో క్లిప్ ట్విట్టర్‌లో ప్రసారం అయింది. ఇదే లాంచ్ ఈవెంట్‌లో ఒప్పో ఎన్కో ఎయిర్ 3 TWS ఇయర్‌బడ్స్‌ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ప్రొడక్ట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: New smartphone, Oppo, Tech news