ఒప్పో రెనో సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. ఒప్పో రెనో 8టీ 5జీ (Oppo Reno 8T 5G) మోడల్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇందులో పాపులర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ (Qualcomm Snapdragon 695), 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, కర్వ్‌డ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పటికే ఒప్పో రెనో 8 సిరీస్‌లో ఒప్పో రెనో 8ప్రో (Oppo Reno 8 Pro) భారతీయ మార్కెట్‌లో ఉంది. ఇప్పుడు ఒప్పో రెనో 8టీ 5జీ వచ్చేసింది. కేవలం ఒకే వేరియంట్‌లో ఒప్పో రెనో 8టీ 5జీ మొబైల్ రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. సన్‌రైజ్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
ఫిబ్రవరి 10న సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రీటైల్ ఔట్‌లెట్స్‌లో కొనొచ్చు. లాంఛింగ్ ఆఫర్స్‌లో భాగంగా కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‍సీ, యెస్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డులతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐతో కొనొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనేవారికి రూ.3,000 వరకు అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.
UPI Transaction Limit: గూగుల్ పే, ఫోన్‌పే, ఇతర యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? లిమిట్ ఎంతంటే?
Ready for an upgrade that takes you #AStepAbove? Featuring an incredible 120Hz 3D Curved Screen & 108MP Portrait Camera ???? the #OPPOReno8T #5G combines a flawless viewing experience with top-tier camera capabilities! ???? Available from 10th Feb at just ₹29,999/-
— OPPO India (@OPPOIndia) February 3, 2023
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.57 అంగుళాల కర్వ్‌డ్ ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది గతేడాది పాపులర్ అయిన 5జీ ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్‌తో రియల్‌మీ 10 ప్రో, నోకియా జీ60, మోటో జీ62, వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్, పోకో ఎక్స్4 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో+, ఐకూ జెడ్6, రియల్‌మీ 9 ప్రో లాంటి మొబైల్స్‌లో ఉంది. అయితే ఈ మొబైల్స్ అన్నీ రూ.20,000 లోపు ధరలో లభిస్తున్నవే.
Jio New Plans: రోజూ 2.5జీబీ డేటాతో జియో కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మైక్రోస్కోప్ లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,800ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 67వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 + కలర్‌ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Oppo, Smartphone