హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oppo Reno 8: డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, Sony IMX766 కెమెరా, 80వాట్ ఛార్జర్... భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న ఒప్పో రెనో 8

Oppo Reno 8: డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, Sony IMX766 కెమెరా, 80వాట్ ఛార్జర్... భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న ఒప్పో రెనో 8

Oppo Reno 8: డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, Sony IMX766 కెమెరా, 80వాట్ ఛార్జర్... భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న ఒప్పో రెనో 8
(image: Oppo India)

Oppo Reno 8: డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, Sony IMX766 కెమెరా, 80వాట్ ఛార్జర్... భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న ఒప్పో రెనో 8 (image: Oppo India)

Oppo Reno 8 | మంచి కెమెరా ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఒప్పో రెనో 8 సిరీస్‌లో రెండు మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. ఒప్పో రెనో 8 స్మార్ట్‌ఫోన్‌లో డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, Sony IMX766 కెమెరా, 80వాట్ ఛార్జర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఇంకా చదవండి ...

ఇండియాలో ఒప్పో రెనో 8 సిరీస్‌లో (Oppo Reno 8 Series) ఒప్పో రెనో 8 ప్రో, ఒప్పో రెనో 8 మోడల్స్ లాంఛ్ అయ్యాయి. వీటిలో ఒప్పో రెనో 8 ప్రో సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఒప్పో రెనో 8 సేల్ జూలై 23న మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో ఇండియా స్టోర్‌లో కొనొచ్చు. ఒప్పో రెనో 8 (Oppo Reno 8) స్మార్ట్‌ఫోన్‌లో రెండు సోనీ ఫ్లాగ్‌షిప్ కెమెరాలు, 80వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలు ఉండటం విశేషం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో (Flipkart Big Saving Days) ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి.

ఒప్పో రెనో 8 ధర, ఆఫర్స్


ఒప్పో రెనో 8 స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. ధర రూ.29,999. బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.26,999 ధరకే కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులతో కొంటే రూ.3,000, ఎస్‌బీఐ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,250 తగ్గింపు లభిస్తుంది. హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. షిమ్మర్ బ్లాక్, షిమ్మర్ గోల్డ్ కలర్స్‌లో కొనొచ్చు.

Redmi K50i: డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 5,080mAh బ్యాటరీ, 64MP కెమెరా... భారీ డిస్కౌంట్‌తో సేల్

ఒప్పో రెనో 8 స్పెసిఫికేషన్స్


ఒప్పో రెనో 8 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 12 + కలర్‌ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Samsung Offer: 12GB వరకు ర్యామ్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా... ఆఫర్ ధర రూ.9,999 మాత్రమే

ఒప్పో రెనో 8 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ Sony IMX766 కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో ఫోటో, పోర్ట్‌రైట్, నైట్, పనోరమిక్, ప్రో, స్టిక్కర్, డ్యూయల్-వ్యూ వీడియో, మాక్రో, టెక్స్ట్ స్కానర్, టైమ్-లాప్స్, స్లో-మో, ఎక్స్‌ట్రా హెచ్‌డీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఒప్పో రెనో 8 స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ Sony IMX709 కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాలో ఫోటో, పోర్ట్‌రైట్, నైట్, పనోరమిక్, స్టిక్కర్, వీడియో, డ్యూయల్-వ్యూ వీడియో, టైమ్-లాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Oppo, Smartphone

ఉత్తమ కథలు