సెల్ఫీ కెమెరా ఫోన్లలో తనదైన ముద్ర వేసుకున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ ఒప్పో.. మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ముఖ్యంగా యూత్ కస్టమర్లలో మంచి పేరున్న రెనో 7 సిరీస్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది.
సెల్ఫీ కెమెరా ఫోన్లలో తనదైన ముద్ర వేసుకున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ ఒప్పో.. మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ముఖ్యంగా యూత్ కస్టమర్లలో మంచి పేరున్న రెనో 7 సిరీస్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది.
సెల్ఫీ కెమెరా ఫోన్లలో(Camera Phone) తనదైన ముద్ర వేసుకున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ ఒప్పో.. మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ముఖ్యంగా యూత్ కస్టమర్లలో మంచి పేరున్న రెనో 7 సిరీస్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ సిరీస్ ఫోన్లు ఫిబ్రవరి 4న భారతదేశానికి అధికారికంగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఒప్పో ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 7తో(Oppo Reno 7) పాటు.. ఒప్పో రెనో 7 ప్రో(Oppo Reno 7 Pro) ఉంటాయని తెలిపింది. అలాగే Oppo Reno 7SEని కూడా భారత మార్కెట్లలోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఈ ఫోన్ Samsung Galaxy M52 5Gకి గట్టి పోటీనిస్తుందని కంపెనీ భావిస్తోంది.
అధికారిక సమాచారం ప్రకారం.. ప్రస్తుతం లాంచ్ కానున్న Oppo Reno 7 ప్రో గతేడాది చైనాలో విడుదల చేసిన మోడల్ మాదిరిగానే ఉండనుంది. పోస్టర్లలో బ్లూ కలర్ ఫినిషింగ్‌తో కనిపిస్తున్న ఈ ఫోన్.. మరిన్ని వేరియంట్లలో లభించనుంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ ఫోన్ ఇండియాలో హాట్ కేకులా అమ్ముడవ్వడం ఖాయమని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అద్భుతమైన సెల్ఫీల కోసం సోనీ సెన్సార్‌ను దీనిలో వాడారు. ఫలితంగా.. సెల్ఫీలు, గ్రూఫీల విషయంలో ఈ ఫోన్ యువతను ఆకర్షిస్తుందని చెప్పవచ్చని కంపెనీ ప్రకటన ఒకటి పేర్కొంది.
ఒప్పో రెనో 7 ప్రో స్పెసిఫికేషన్స్..
32 మెగాపిక్సెల్ Sony IMX709 సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా.. ఈ ఫోన్ స్పెషాలిటీ. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులుంటే కెమెరా ఆటోమేటిక్‌గా 90 డిగ్రీలకు మారుతుందని Oppo వివరించింది. స్టిల్ ఫొటోల కోస వెనుకవైపు 50 మెగాపిక్సెల్ IMX766 ప్రైమరీ సెన్సార్ కూడా ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.55ఇంచెస్ 90Hz ప్రత్యేక డిస్ప్లే, 12GB RAM, 256GB స్టోరేజీ, MediaTek Dimensity 1200 Max చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్లు దీని సొంతం. 4,500mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్.. 65W ఫాస్ట్ ఛార్జర్‌ను కలిగి ఉంది.
Oppo Reno 7 ఫీచర్స్..
ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.43-అంగుళాల 90Hz డిస్ప్లే, Snapdragon 778G SoC ప్రాసెసర్, బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా.. ఫ్రంట్‌సైడ్ 32 మెగాపిక్సెల్ Sony IMX709 కెమెరా, 60W సూపర్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో రెనో 7 ఫోన్ రానుంది.
ధర ఎంత?
భారత్‌లో Oppo Reno 7 సిరీస్ ధర రూ.25,000 నుంచి రూ.45,000 వరకు ఉండొచ్చని టిప్‌స్టర్ టెక్ సీఈఓ యోగేష్ బ్రార్ పేర్కొన్నారు. అలాగే త్వరలో Oppo X5 సిరీస్‌ను భారత్‌లోకి లాంచ్ చేస్తుందని తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.