Home /News /technology /

OPPO RENO 7 5G RENO 7 PRO 5G TO LAUNCH IN INDIA SOON COMPANY CONFIRMS GH VB

Oppo 7 Series: ఒప్పో నుంచి రెండు 7 సిరీస్​ ఫోన్లు.. ఆన్​లైన్​లో లీకైన ధర, ఫీచర్ల వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం (Image Credit : Twitter)

ప్రతీకాత్మక చిత్రం (Image Credit : Twitter)

ప్రముఖ స్మార్ట్​ఫోన్(Smartphone)​ తయారీ సంస్థ ఒప్పో(Oppo) నుంచి త్వరలోనే ఒప్పో రెనో 7 (Oppo Reno 7) కొత్త సిరీస్​ ఫోన్లు మార్కెట్​లోకి రానున్నాయి. తాజాగా వీటి లాంచింగ్​ను ఆ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది.

ప్రముఖ స్మార్ట్​ఫోన్(Smartphone)​ తయారీ సంస్థ ఒప్పో(Oppo) నుంచి త్వరలోనే ఒప్పో రెనో 7 (Oppo Reno 7) కొత్త సిరీస్​ ఫోన్లు మార్కెట్​లోకి రానున్నాయి. తాజాగా వీటి లాంచింగ్​ను ఆ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. ఒప్పో తన అధికారిక వెబ్‌సైట్‌లో (Website) ఒప్పో రెనో 7 సిరీస్‌ను టీజ్ చేసింది. అయితే ఈ సిరీస్​ లాంచింగ్​ తేదీ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ సిరీస్​ కింద ఒప్పో రెనో 7 5జీ(Oppo Reno 7 Five G), ఒప్పో రెనో 7SE 5G, ఒప్పో రెనో 7 ప్రో 5G స్మార్ట్​ఫోన్లు భారత మార్కెట్​లోకి రానున్నాయి. ఇప్పటికే ఇవి చైనా మార్కెట్​లోకి లాంచ్​ అయ్యాయి. కొన్ని ప్రత్యేక ఎడిషన్ హ్యాండ్‌సెట్‌లతో పాటు ఒప్పో సంస్థ వీటిని గతేడాది చైనాలో ఆవిష్కరించింది. అక్కడ మంచి స్పందన రావడంతో.. అతి పెద్ద మొబైల్​ మార్కెట్​గా ఉన్న భారత్​లో లాంచ్​ చేసేందుకు ఒప్పో సిద్దమవుతోంది. అయితే, భారత్​లో ఖచ్చితమైన లాంచింగ్​ డేట్​, ధర, స్పెసిఫికేషన్ల వివరాలపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Xiaomi 11i vs Vivo V23: డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

ఒప్పో రెనో 7 సిరీస్​ ఫోన్ల ధర (అంచనా)..
గత నెలలో ఒప్పో రెనో 7 సిరీస్​ ధర ఆన్​లైన్​లో లీకైంది. దీన్ని బట్టి చూస్తే.. ఒప్పో రెనో 7 5జీ ఫోన్​ ధర రూ. 28 వేల నుంచి రూ. 31 వేల వరకు ఉండనుంది. అలాగే, ఒప్పో రెనో 7 ప్రో 5జీ ఫోన్​ రూ. 41 వేల నుంచి రూ. 43 వేల వరకు ఉండనుంది. ఈ ఫోన్లు తొలుత ఫ్లిప్​కార్ట్​ ద్వారా అమ్మకానికి రానున్నాయి.

ఒప్పో రెనో 7 సిరీస్ స్పెసిఫికేషన్లు..
చైనాలో ఇప్పటికే ఒప్పో రెనో 7 5G స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యాయి. ఇవే ఫీచర్లతో భారత్​లోనూ వీటిని విడుదల చేసేందుకు కంపెనీ సిద్దమవుతోంది. ఒప్పో రెనో 7 5జీ ఫోన్​ క్వాల్​కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. మరోవైపు, ఒప్పో రెనో 7ప్రో మోడల్‌ మీడియా టెక్​ డైమెన్సిటీ 1200- మాక్స్​ SoC ప్రాసెసర్​ ఉండనుంది.



iPhone Offer: రూ.17,599 ధరకేఐఫోన్ సొంతం చేసుకోండి... అమెజాన్‌లో ఆఫర్

ఒప్పో రెనో 7 5జీ స్మార్ట్​ఫోన్​ ప్రపంచంలోనే మొట్టమొదటి సోనీ IMX709 అల్ట్రా-సెన్సింగ్ సెన్సార్​ కెమెరాతో వస్తుంది. ఈ కెమెరా 32-మెగాపిక్సెల్ రిజల్యూషన్​ కలిగి ఉంటుంది. ఇక దీనిలో 1/1.56 అంగుళాల ఫ్లాగ్‌షిప్ సోనీ IMX766 సెన్సార్ కెమెరాను కూడా అందించనుంది. ఇది 50-మెగాపిక్సెల్​ రిజల్యూషన్​తో వస్తుంది. ఈ సెన్సార్లు ఒప్పో రెనో 7 ప్రోలో కూడా అందించనుంది. చైనాలో ఒప్పో రెనో 7 సిరీస్ లాంచ్ సందర్భంగా, కంపెనీ ఒప్పో రెనో 7 5G న్యూ ఇయర్ ఎఐడిషన్‌ను కూడా లాంచ్​ చేసింది. దీనితో పాటు ఒప్పో రెనో 7 ప్రో లీగ్ ఆఫ్ లెజెండ్స్ ఎడిషన్‌ను కూడా ఆవిష్కరించింది.
Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oppo, Smartphone

తదుపరి వార్తలు