Home /News /technology /

OPPO Reno 6: ఒప్పో రెనో 6 సిరీస్​ నుంచి ఒకేసారి మూడు స్మార్ట్​ఫోన్లు లాంఛ్​.. ధర, ఫీచర్ల వివరాలివే..

OPPO Reno 6: ఒప్పో రెనో 6 సిరీస్​ నుంచి ఒకేసారి మూడు స్మార్ట్​ఫోన్లు లాంఛ్​.. ధర, ఫీచర్ల వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఒప్పో నుంచి ఒకేసారి మూడు స్మార్ట్​ఫోన్లు లాంఛ్ అయ్యాయి. ఆ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఒప్పో నుంచి ఒకేసారి ఏకంగా మూడు స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యాయి. OPPO రెనో 6, రెనో 6 ప్రో, రెనో 6 ప్రో ప్లస్ పేర్లతో ఈ మూడు స్మార్ట్​ఫోన్లు చైనా మార్కెట్​లోకి లాంచ్ అయ్యాయి. గతేడాది విడుదలైన రెనో 5 లైనప్‌కు కొనసాగింపుగా వీటిని రూపొందించారు. అయితే ఈ ఒప్పో రెనో 6 సిరీస్ భారత మార్కెట్లోకి ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంపై ఇంకా స్పష్టతలేదు. 5 జి కనెక్టివిటీతో వచ్చే ఈ మూడు స్మార్ట్​ఫోన్ల ధర, ఫీచర్ల వివరాలను పరిశీలిద్దాం.
Redmi Note 10 Pro 5G: రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ రిలీజ్... ఫీచర్స్ ఇవే..

ఒప్పో రెనో 6 సిరీస్​ ధరలు
చైనాలో విడులైన ఒప్పో రెనో 6 ధర విషయానికి వస్తే.. దీని 8GB RAM, 128GB బేస్​ మోడల్​ ధర CNY 2,799 (సుమారు రూ. 31,800) వద్ద ప్రారంభమవుతుంది. రెనో 6 ప్రో 8 జిబి /128 జిబి మోడల్ ధర బేస్​ మోడల్​ CNY 3,499 (సుమారు రూ .39,800) వద్ద లభిస్తుంది. కాగా, రెనో 6 ప్రో + 8 జిబి /128 జిబి మోడల్​ CNY 3,999 (సుమారు రూ .45,500) ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

ఒప్పో రెనో 6 స్పెసిఫికేషన్లు
ఒప్పో రెనో 6 స్మార్ట్​ఫోన్ 6.43 అంగుళాల FHD + AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoCతో పనిచేస్తుంది. ఇది 12GB RAM, 256GB ఇంటర్నల్​ మెమరీతో వస్తుంది. దీని స్టోరేజ్​ను మైక్రో SD కార్డ్ స్లాట్ సహాయంతో మరింత విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్‌ ఓఎస్ 11 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. దీనిలో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల ఈ స్మార్ట్​ఫోన్​లో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. కెమెరా విషయానికి వస్తే.. ఒప్పో రెనో 6 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలును చేర్చింది.

వీటిలో 64MP ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ కెమెరాలను అందించింది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం దీని ముందు భాగంలో ప్రత్యేకంగా 32MP స్నాపర్ కెమెరాను కూడా చేర్చింది. సెక్యూరిటీ కోసం దీనిలో ఇన్-డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించింది. ఇక, కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 5జి /4 జి ఎల్‌టిఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి చేర్చింది.

ఒప్పో రెనో 6 ప్రో, రెనో 6 ప్రో ప్లస్
ఒప్పో రెనో 6 ప్రో స్మార్ట్​ఫోన్​లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.55 -అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను అందించింది. రెనో 6 ప్రో, రెనో 6 ప్రో + రెండూ 2,400 ఎక్స్ 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటాయి. వీటిలో పంచ్-హోల్ కటౌట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్​ను​ అందించింది. రెనో 6 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC చేత శక్తినివ్వగా, రెనో 6 ప్రో + క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌తో శక్తినిస్తుంది.

ఈ రెండు ఫోన్లలోనూ 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​లను అందించింది. రెనో 6, రెనో 6 ప్రో + ఆండ్రాయిడ్ 11-బేస్డ్ కలర్‌ ఓఎస్ స్కిన్‌పై పనిచేస్తాయి. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగిన ఈ రెండు ఫోన్లలో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించింది.

ఒప్పో రెనో 6 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64MP ప్రైమరీ సెన్సార్, 8MP వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ కెమెరాలను చేర్చింది. ఇక, రెనో 6 ప్రో + మోడల్​లో క్వాడ్ కెమెరా సెటప్​ను అందించింది. ఇందులో 50 ఎంపి సోనీ IMX766 సెన్సార్, 16 ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపి మాక్రో లెన్స్, 13 ఎంపి టెలిఫోటో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లలో సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 32 ఎంపి కెమెరాను చేర్చింది. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. వీటిలో 5 జి /4 జి ఎల్‌టిఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, జిపిఎస్, యూఎస్‌బి టైప్-సి పోర్ట్ ఛార్జింగ్, డేటా బదిలీ వంటివి అందించింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, China, Oppo

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు