Oppo Reno 6 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో ఒప్పో రెనో 6, రెనో 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి

Oppo Reno 6 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో ఒప్పో రెనో 6, రెనో 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి (image: Oppo India)

Oppo Reno 6 5G | 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మరో రెండు 5జీ మొబైల్స్ ఇండియాలో లాంఛ్ అయ్యాయి. ఒప్పో రెనో 6 5జీ, ఒప్పో రెనో 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ల ప్రత్యేకతలు తెలుసుకోండి.

  • Share this:
    ఒప్పో నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో లాంఛ్ అయ్యాయి. ఒప్పో రెనో 6 5జీ, ఒప్పో రెనో 6 ప్రో 5జీ మోడల్స్‌ని ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది ఒప్పో. ఈ ఏడాది మేలో చైనాలో ఒప్పో రెనో 6 సిరీస్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఒప్పో రెనో 6 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా చైనాలో రిలీజ్ అయింది. ఈ ఒక్క మోడల్ ఇండియాకు రాలేదు. కానీ మిగతా రెండు మోడల్స్ అయిన ఒప్పో రెనో 6 5జీ, ఒప్పో రెనో 6 ప్రో 5జీ రిలీజ్ అయ్యాయి. ఒప్పో రెనో 6 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990 కాగా, ఒప్పో రెనో 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,990. ఒప్పో రెనో 6 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ జూలై 29న, ఒప్పో రెనో 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ జూలై 20న ప్రారంభమౌతుంది. ఫ్లిప్‌కార్ట్, రిలయెన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, క్రోమా, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఇతర రీటైలర్ల దగ్గర ఈ స్మార్ట్‌ఫోన్లు కొనొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.4,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డులపైనా ఈ ఆఫర్ ఉంది. పేటీఎం ద్వారా కొంటే 15 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

    Smartphone Tips: మీ పాత స్మార్ట్‌ఫోన్ అమ్ముతున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

    Google: ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ గూగుల్ అకౌంట్ సేఫ్... వెంటనే మార్చండి ఇలా


    ఒప్పో రెనో 6 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లాట్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఒప్పో రెనో 6 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్ వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, వైఫై 6, బ్లూటూత్ 5.2 వర్షన్, యూఎస్‌బీ టైప్ సీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 + కలర్ ఓఎస్ 11.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

    Redmi Note 10 Pro Max: ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.1,999 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితం

    WhatsApp: వాట్సప్ నోటిఫికేషన్ చిక్కులకు ఇక చెక్... ఈ 7 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి


    ఒప్పో రెనో 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఒప్పో రెనో 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఒప్పో రెనో 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్ వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + కలర్ ఓఎస్ 11.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

    ఇక ఒప్పో రెనో 6 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లతో పాటు ఒప్పో ఎన్‌కో ఎక్స్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ బ్లూ కలర్‌లో లాంఛ్ చేసింది కంపెనీ. ఒప్పో ఎన్‌కో ఎక్స్ ధరను రూ.9,990 నుంచి రూ.8,990 ధరకు తగ్గించింది. ఇక ఒప్పో వాచ్ ధర కూడా రూ.14,990 నుంచి రూ.12,990 ధరకు తగ్గింది.
    Published by:Santhosh Kumar S
    First published: