Oppo Reno 6: ఒప్పో రెనో 6 సిరీస్​లో 4జి మోడల్ విడుదల.. 5జి కంటే మెరుగైన ఫీచర్లు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

అయితే ఇప్పుడు రెనో 6- 4G వేరియంట్లో కొన్ని మార్పులు చేసి ఇండోనేషియా మార్కెట్​లోకి లాంచ్​ చేసింది ఒప్పో సంస్థ. ఇందులో 5జి వేరియంట్ కంటే భిన్నమైన ఫీచర్లను అందించింది.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ ఒప్పో నుంచి రెనో 6 సిరీస్​లో ఇటీవల రెండు 5G వేరియంట్లు విడుదలయ్యాయి. వీటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు రెనో 6- 4G వేరియంట్లో కొన్ని మార్పులు చేసి ఇండోనేషియా మార్కెట్​లోకి లాంచ్​ చేసింది ఒప్పో సంస్థ. ఇందులో 5జి వేరియంట్ కంటే భిన్నమైన ఫీచర్లను అందించింది. దీని ప్రాసెసర్‌తో పాటు కెమెరా, బ్యాటరీ, ఇతర ఫీచర్లలో అనేక మార్పులు చేసింది. ఒప్పో రెనో 6- 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 900 సోసి ఉపయోగిస్తుండగా.. 4G వేరియంట్​లో మాత్రం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G సోసిని అందించింది. అయితే, 5జి వేరియంట్​లో ట్రిపుల్​ రియర్​ కెమెరా అందించగా.. 4 జి వేరియంట్​లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్​ను చేర్చింది.
iQoo Z3 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... రూ.3,500 తగ్గింపు

ఒప్పో రెనో 6 4 జి ధర
8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ఆప్షన్ గల ఒప్పో రెనో 6- 4G ఇండోనేషియాలో IDR 5,199,000 (సుమారు రూ. 26,700) ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ స్టెల్లార్ బ్లాక్, అరోరా కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీన్ని ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు లాజాడా, షాపీ వంటి అనేక ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్లు
ఒప్పో రెనో 6- 4G ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్‌ ఓఎస్ 11.1 పై నడుస్తుంది. ఇది 6.4 -అంగుళాల ఫుల్ -హెచ్‌డి ప్లస్​ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్‌ గల ఈ స్మార్ట్​ఫోన్​ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720 జి సోసితో పనిచేస్తుంది. ఇక, కెమెరాల విషయానికొస్తే, ఒప్పో రెనో 6 4 జిలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కెమెరా వంటివి చేర్చింది. దీని ముందు భాగంలో సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది.

ఒప్పో రెనో 6- 4Gలో 50W ఫ్లాష్ ఛార్జ్ వూక్ 4.0 సపోర్ట్​తో కూడిన 4,310 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చింది. ఇది ఫేస్ అన్‌లాక్‌ సపోర్ట్​తో పాటు ఫింగర్​ ప్రింట్​ సెన్సార్​ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. డ్యూయల్ సిమ్ (నానో), వై-ఫై, బ్లూటూత్ వి 5.1, యూఎస్‌బి టైప్-సి, ఎన్‌ఎఫ్‌సి, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటివి అందించింది. ఆన్‌బోర్డ్‌లోని సెన్సార్లలో జియోమాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్, పెడోమీటర్ వంటివి చేర్చింది.
Published by:Nikhil Kumar S
First published: