విడిపోయిన ఒప్పో, రియల్‌మీ!

ఒప్పో సబ్-బ్రాండ్‌గా రియల్‌మీ పరిచయమైంది. కానీ ఇకపై ఈ రెండు వేర్వేరు బ్రాండ్లు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడింది.

news18-telugu
Updated: August 1, 2018, 12:11 PM IST
విడిపోయిన ఒప్పో, రియల్‌మీ!
(image: News18.com)
  • Share this:
రియల్‌మీ... చైనాకు చెందిన ఒప్పో నుంచి వచ్చిన సబ్-బ్రాండ్. షావోమీకి రెడ్‌మీ ఎలాగో... ఒప్పో బ్రాండ్‌కు రియల్‌మీ అలా సబ్-బ్రాండ్ అనుకున్నారు. కానీ లాంఛైన కొన్ని నెలలకే ఈ రెండు బ్రాండ్లు విడిపోయాయి. ఒప్పో నుంచి విడిపోతున్నట్టు చైనాకు చెందిన వీబో వెబ్‌సైట్‌లో రియల్‌మీ ప్రకటన విడుదల చేసింది. ఒప్పోలో సీనియర్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేసిన స్కైలీ ఇకపై రియల్‌మీ బ్రాండ్‌ను చూసుకుంటారు. స్ట్రాంగ్ పర్ఫామెన్స్, స్టైలిష్ డిజైన్లతో సరసమైన ధరలకే రియల్‌మీ ఫోన్లను అందిస్తామని కంపెనీ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు సెల్‌ఫోన్ల విషయంలో వేర్వేరు అలవాట్లుంటాయి. వారిని దృష్టిలో పెట్టుకోని వారి అవసరాలకు తగ్గట్టుగా పర్ఫామెన్స్, డిజైన్‌తో ఫోన్లు తయారు చేస్తాం. సరికొత్త ఆవిష్కరణలతో మా ప్రొడక్ట్స్ తీసుకొస్తాం. గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో మా సత్తా చాటుతాం.
స్కైలీ, రియల్‌మీ గ్లోబల్ సీఈఓ


ఒప్పో నుంచి విడిపోయి సొంతగా బ్రాండ్ పెట్టుకోవడం ఇది రెండోసారి. గతంలో పీటీ లావు ఒప్పో నుంచి వెళ్లిపోయి సొంతగా వన్‌ప్లస్ బ్రాండ్ సృష్టించారు. ఇప్పుడు ఒప్పో నుంచి బయటకు వచ్చిన స్కైలీ రియల్‌మీ బ్రాండ్‌కు సీఈఓగా మారారు. మేలో "రియల్‌మీ 1" ఫోన్ రిలీజైంది. నలభై రోజుల్లో నాలుగు లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి. కేవలం ఒక నెలలోనే రెండో త్రైమాసికంలో 1.4శాతం మార్కెట్‌షేర్‌ సాధించడం విశేషం.
First published: August 1, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>