ఒప్పో నుంచి మరో రెండు ఫోన్లు!

ఒప్పో ఆర్17, ఆర్17 ప్రో ఫోన్లు ఆగస్ట్ 23న లాంఛ్ కానున్నాయి. వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకత.

news18-telugu
Updated: August 15, 2018, 5:57 PM IST
ఒప్పో నుంచి మరో రెండు ఫోన్లు!
ఒప్పో ఆర్17, ఆర్17 ప్రో ఫోన్లు ఆగస్ట్ 23న లాంఛ్ కానున్నాయి. వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకత.
  • Share this:
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో మరో రెండు ఫోన్లను లాంఛ్ చేయనుంది. ఆర్17, ఆర్17 ప్రో ఫోన్లను చైనాలోని షాంఘైలో ఆగస్ట్ 23న ఆవిష్కరించనుంది. ఇందుకు సంబంధించిన టీజర్ వీడియో... వీబోలో ఒప్పో అఫిషియల్ అకౌంట్‌లో కనిపించింది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫోటోలు లీకయ్యాయి. మిగతా ఫోన్లకు ఉన్నట్టు కాకుండా వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ట్రిపుల్ కెమెరాతో ఈ ఫోన్ రానుంది. 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ నియాన్ పర్పుల్, స్ట్రీమ్ బ్లూ కలర్స్‌లో లభించనుంది. 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఓలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఏఐ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. స్నాప్‌డ్రాగన్‌ 670 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 3,500 ఎంఏహెచ్ ఉంటుందని అంచనా.

ఇవి కూడా చదవండి:

గూగుల్ మిమ్మల్ని వెంటాడుతోంది!

గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?

స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తే కళ్లు పోతాయ్!
Published by: Santhosh Kumar S
First published: August 15, 2018, 5:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading