Oppo A53: ఒప్పో నుంచి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్... ఒప్పో ఏ53 ఫీచర్స్ ఇవే

Oppo A53 | ఒప్పో ఏ53 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర, ఇతర వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 25, 2020, 1:34 PM IST
Oppo A53: ఒప్పో నుంచి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్... ఒప్పో ఏ53 ఫీచర్స్ ఇవే
Oppo A53: ఒప్పో నుంచి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్... ఒప్పో ఏ53 ఫీచర్స్ ఇవే (image: Oppo India)
  • Share this:
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఒప్పో ఏ53 మోడల్‌ను పరిచయం చేసింది కంపెనీ. 90Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో ఒప్పో ఏ53 రిలీజైంది. ప్రారంభ ధర రూ.12,990. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు 10,000ఎంఏహెచ్ ఒప్పో పవర్ బ్యాంక్ 2 కూడా లాంఛ్ చేసింది కంపెనీ. ఈ పవర్ బ్యాంక్ ధర రూ.1,299. ఒప్పో ఏ53 స్మార్ట్‌ఫోన్‌తో కలిపి పవర్ బ్యాంక్ కొంటే రూ.400 తగ్గింపు లభిస్తుంది. అంటే పవర్ బ్యాంకును రూ.899 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇవాళ్టి నుంచే ఒప్పో ఏ53 స్మార్ట్‌ఫోన్, పవర్ బ్యాంక్ కొనొచ్చు.

OnePlus: వన్‌ప్లస్ మరో సంచలనం... తక్కువ బడ్జెట్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్స్

Jio IPL Special Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు

Oppo A53 Features, Oppo A53 Specs, Oppo A53 Specifications, Oppo A53 India price, Oppo A53 price, Oppo A53 Sale, Oppo A53 launch, Oppo Power Bank 2, Smartphone under 15k, Smartphone under 15000, ఒప్పో ఏ53 ధర, ఒప్పో ఏ53 స్పెసిఫికేషన్స్, ఒప్పో ఏ53 రిలీజ్, ఒప్పో ఏ53 సేల్, ఒప్పో ఏ53 ఫీచర్స్, ఒప్పో పవర్ బ్యాంక్ 2
image: Oppo India


ఒప్పో ఏ53 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.5 అంగుళాలు
ర్యామ్: 4జీబీ, 6జీబీఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460
రియర్ కెమెరా: 13+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+కలర్ ఓఎస్ 7.2
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: ఫెయిరీ వైట్, ఫ్యాన్సీ బ్లూ, ఎలక్ట్రిక్ బ్లాక్
ధర:
4జీబీ+64జీబీ- రూ.12,990
6జీబీ+128జీబీ- రూ.15,490
Published by: Santhosh Kumar S
First published: August 25, 2020, 1:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading