Oppo K9s: ఒప్పో K సిరీస్​లో మరో మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్ లాంచ్​.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ఒప్పో K- సిరీస్ 2020లో ప్రారంభమైంది. ఈ మిడ్​రేంజ్​ సిరీస్​కు​ తక్కువ కాలంలో మంచి ఆదరణ లభించింది. ఈ సిరీస్​లో ఇప్పటికే ఒప్పో K, K9 ప్రో స్మార్ట్​ఫోన్లు విడుదలవ్వగా.. తాజాగా K9s మోడల్​ లాంచ్​ అయ్యింది.

ఒప్పో K- సిరీస్ 2020లో ప్రారంభమైంది. ఈ మిడ్​రేంజ్​ సిరీస్​కు​ తక్కువ కాలంలో మంచి ఆదరణ లభించింది. ఈ సిరీస్​లో ఇప్పటికే ఒప్పో K, K9 ప్రో స్మార్ట్​ఫోన్లు విడుదలవ్వగా.. తాజాగా K9s మోడల్​ లాంచ్​ అయ్యింది.

  • Share this:
బడ్జెట్​, మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​(Smart Phone) మార్కెట్​లో దూసుకుపోతున్న ఒప్పో(Oppo) తాజాగా మరో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది. ఒప్పో K- సిరీస్​లో ఒప్పో K9s (Oppo K9s) స్మార్ట్​ఫోన్​ను చైనా(China) మార్కెట్​లోకి ఆవిష్కరించింది. ఒప్పో K- సిరీస్ 2020లో ప్రారంభమైంది. ఈ మిడ్​రేంజ్​ సిరీస్​కు​ తక్కువ కాలంలో మంచి ఆదరణ లభించింది. ఈ సిరీస్​లో ఇప్పటికే ఒప్పో K, K9 ప్రో స్మార్ట్​ఫోన్లు విడుదలవ్వగా.. తాజాగా K9s మోడల్​ లాంచ్​ అయ్యింది. ఈ స్మార్ట్​ఫోన్ మొత్తం మూడు కలర్ ఆప్షనల్లో లభిస్తుంది. మ్యాజిక్ పర్పుల్ క్విక్ సాండ్, అబ్సిడియన్ వారియర్, నియాన్ సిల్వర్ సీ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో బడ్జెట్​ ధరలోనే అద్భుతమైన ప్రీమియం ఫీచర్లను అందించింది.

JioPhone Next: గుడ్ న్యూస్... దీపావళిలోపే జియోఫోన్ నెక్స్‌ట్ లాంఛ్ చేయనున్న రిలయన్స్... ధర ఎంతంటే


ఒప్పో K9s ధర..
ఒప్పో K9s హ్యాండ్‌సెట్​ ప్రస్తుతానికి చైనాలోనే విడుదలైంది. భారత మార్కెట్​లో రిలీజ్​ డేట్​, ధర విషయాలపై స్పష్టత లేదు. అయితే ఇది భారత్​లో రూ .18 వేల నుంచి రూ. 20 వేల రేంజ్​లో లభించే అవకాశం ఉంది. ఈ మేరకు పలు నివేదికలు సూచించాయి.

ఒప్పో K9s స్పెసిఫికేషన్లు..
ఒప్పో K9s స్మార్ట్​ఫోన్​ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన TFT LCD ఫుల్ హెచ్​డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్​ప్లే కొత్త యాపిల్ ఐఫోన్ 13 రిఫ్రెష్ రేట్‌కు సమానంగా ఉంటుంది. ఒప్పో అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ స్మార్ట్​ఫోన్​ హీట్ అవ్వకుండా దీనిలో ఏడు రకాల థర్మల్ డిసిపేషన్ మెటీరియల్స్​తో పాటు 0.15 మి.మీ. వరకు గ్రాఫైట్ షీట్‌ను అందించింది.

Samsung Galaxy M32 5G: రూ.20,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,199 ధరకే కొనండి ఇలా


కెమెరా విషయానికి వస్తే.. ఒప్పో K9లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్​ వైడ్-యాంగిల్​ కెమెరా వంటివి చేర్చింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్​ కెమెరాను అందించింది. వీటికి అదనంగా గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్ వంటి సెన్సార్లను చేర్చింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో నానో-సిమ్ కార్డుకు సపోర్ట్​ చేసే డ్యుయల్ సిమ్ నెట్‌వర్క్ సిమ్​ స్లాన్​ను ఒప్పో అందించింది. ఈ హ్యాండ్‌సెట్లో 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీ.. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ బ్యాటరీని కేవలం 59 నిమిషాల్లోనే 1 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
Published by:Veera Babu
First published: