Oppo K9 Pro: ఒప్పో నుంచి కొత్త K9 ప్రో..64 MP కెమెరా, 60W చార్జింగ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్

ప్రతీకాత్మకచిత్రం

బడ్జెట్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేకత చాటుకున్న ఒప్పో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ సంస్థ K9 ప్రో (Oppo K9 Pro) పేరుతో రూపొందించిన సరికొత్త డివైజ్‌ను సెప్టెంబర్ 26న చైనాలో లాంచ్ చేయనుంది.

  • Share this:
బడ్జెట్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేకత చాటుకున్న ఒప్పో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ సంస్థ K9 ప్రో (Oppo K9 Pro) పేరుతో రూపొందించిన సరికొత్త డివైజ్‌ను సెప్టెంబర్ 26న చైనాలో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌పోన్‌కు సంబంధించిన ఫీచర్ల వివరాలను ఒప్పో చైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ను 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, HDR10 సపోర్ట్‌తో తీర్చిదిద్దారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoCతో పనిచేస్తుంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు దీని సొంతం. ఒప్పో K9 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఒప్పో వాచ్ ఫ్రీ, ఒప్పో స్మార్ట్ టీవీ K9 మోడళ్లను కూడా ఈ సంస్థ చైనాలో విడుదల చేయనుంది.

ఒప్పో K9 ప్రో స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను సంస్థ వెబ్‌సైట్‌లో, సోషల్ మీడియాలో వెల్లడించింది. 6.43 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రూపొందించిన ఈ డివైజ్‌ను.. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌, 90fps సపోర్ట్‌తో రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంటుంది. ఇది 60W సూపర్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒప్పో కే9 ప్రో హ్యాండ్‌సెట్‌ను కేవలం 16 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని సంస్థ తెలిపింది. రాత్రివేళ ఛార్జ్ చేసేటప్పుడు డివైజ్ సేఫ్టీ కోసం హ్యాండ్‌సెట్‌లో స్మార్ట్ ఫైవ్-కోర్ సేఫ్టీ ప్రొటెక్షన్ ఫీచర్‌ ఉందని ఒప్పో వెల్లడించింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 MP, 2 MP సామర్థ్యం ఉన్న లెన్స్ సెన్సార్‌లు ఉన్నాయి. 16 MP ఫ్రంట్ కెమెరా సైతం ఉంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఇది విడుదల కానుంది. దీంట్లో Wi-Fi6, 5G, NFC వంటి కనెక్టివిటీ ఆప్షన్లను ఒప్పో అందిస్తోంది. ఈ డివైజ్ 8.5 మి.మీ మందంతో కేవలం 180 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఒప్పో K9 ప్రో ధర వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే దీని ధర CNY 2,399 (సుమారు రూ. 27,400) నుంచి ప్రారంభమవుతుందని గతంలో కొన్ని నివేదికలు వెల్లడించాయి.

ఒప్పో K9 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరో రెండు ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయనుంది. ఒప్పో వాచ్ ఫ్రీ, ఒప్పో స్మార్ట్ టీవీ K9 లను సెప్టెంబర్ 26న విడుదల చేయనుంది. ఒప్పో వాచ్ ఫ్రీ దీర్ఘచతురస్రాకార డిజైన్‌తో రబ్బరు పట్టీతో వస్తుంది. ఒప్పో స్మార్ట్ టీవీ K9.. 75 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది.
Published by:Krishna Adithya
First published: