హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oppo K10: లేటెస్ట్ ప్రాసెసర్‌తో ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

Oppo K10: లేటెస్ట్ ప్రాసెసర్‌తో ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

Oppo K10 | మీరు రూ.15,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఒప్పో నుంచి ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

Oppo K10 | మీరు రూ.15,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఒప్పో నుంచి ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

Oppo K10 | మీరు రూ.15,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఒప్పో నుంచి ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

ఇండియాలో రూ.15,000 లోపు బడ్జెట్‌లోని స్మార్ట్‌ఫోన్లకు (Smartphone Under Rs 15,000) డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్త మోడల్స్‌ని రిలీజ్ చేస్తున్నాయి. లేటెస్ట్‌గా రూ.15,000 లోపు సెగ్మెంట్‌లో ఒప్పో ఇండియా నుంచి ఒప్పో కే10 (Oppo K10) మొబైల్ రిలీజైంది. ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఒప్పో ఎన్‌కో ఎయిర్ 2 ఇయర్‌బడ్స్ కూడా లాంఛ్ అయ్యాయి. ధర రూ.2,499. మార్చి 23న సేల్ ప్రారంభం అవుతుంది. ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే ఇందులో ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇటీవల ఈ ప్రాసెసర్‌తో పలు స్మార్ట్‌ఫోన్స్ ఇండియాలో రిలీజ్ అయ్యాయి.

ఒప్పో కే10 ధర

ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,990 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990. మార్చి 29న సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టాండర్డ్ ఛార్టర్డ్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్‌తో ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,990 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ ఒక ఏడాది సబ్‌స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.

Redmi Note 11 Pro: రెడ్‌మీ నోట్ 11 ప్రో సేల్ ఈరోజే... రూ.2,000 డిస్కౌంట్

ఒప్పో కే10 స్పెసిఫికేషన్స్

ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ 10, రెడ్‌మీ నోట్ 11, వివో వై33టీ, రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్లలో ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.

iQOO Z6: కాసేపట్లో ఐకూ జెడ్6... వారికి రూ.2,000 డిస్కౌంట్

ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ బొకే + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో ఫోటో, వీడియో, నైట్, ఎక్స్‌పర్ట్, పనోరమా, పోర్ట్‌రైట్, టైమ్‌ల్యాప్స్, స్టిక్కర్, స్లోమోషన్, టెక్స్‌ట్ స్కానర్, ఎక్స్‌ట్రా హెచ్‌డీ, మ్యాక్రో, గూగుల్ లెన్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఫోటో, వీడియో, పనోరమిక్, పోర్ట్‌రైట్, నైట్, టైమ్ ల్యాప్స్, స్టిక్కర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + కలర్ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సీ, 3.5 ఎంఎం ఇయర్‌ఫోన్ జాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. బ్లాక్ కార్బన్, బ్లూ ఫ్రేమ్ కలర్స్‌లో కొనొచ్చు.

First published:

Tags: Flipkart, Mobile News, Mobiles, Oppo, Smartphone

ఉత్తమ కథలు