హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oppo K10 5G: ఒప్పో కే10 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... మీడియాటెక్ ప్రాసెసర్, 48MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

Oppo K10 5G: ఒప్పో కే10 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... మీడియాటెక్ ప్రాసెసర్, 48MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

Oppo K10 5G: ఒప్పో కే10 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... మీడియాటెక్ ప్రాసెసర్, 48MP కెమెరా, మరెన్నో ఫీచర్స్
(image: Oppo India)

Oppo K10 5G: ఒప్పో కే10 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... మీడియాటెక్ ప్రాసెసర్, 48MP కెమెరా, మరెన్నో ఫీచర్స్ (image: Oppo India)

Oppo K10 5G | మరో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో రిలీజైంది. ఒప్పో కే10 5జీ (Oppo K10 5G) మొబైల్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో రిలీజైంది.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి పోటాపోటీగా 5జీ స్మార్ట్‌ఫోన్స్ (5G Smartphones) వచ్చేస్తున్నాయి. ఒప్పో ఇండియా లేటెస్ట్‌గా ఒప్పో కే10 5జీ (Oppo K10 5G) మొబైల్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఒప్పో కే10 4జీ మోడల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే స్మార్ట్‌ఫోన్ 5జీ సపోర్ట్‌తో రిలీజైంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 48మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఒప్పో కే10 5జీ కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజైంది. ధర రూ.17,499. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.1,500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రూ.15.999 ధరకే ఒప్పో కే10 5జీ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. జూన్ 15న సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో స్టోర్‌లో కొనొచ్చు.

ఒప్పో కే10 5జీ స్పెసిఫికేషన్స్


ఒప్పో కే10 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌సెల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ 9, రెడ్‌మీ నోట్ 11టీ, వివో వీ23ఈ 5జీ, లావా అగ్ని 5జీ, రియల్‌మీ 8ఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఉంది. ఆండ్రాయిడ్ 12 + కలర్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Mobile Offer: ఒకటి కాదు, రెండు కాదు... ఈ వన్‌ప్లస్ మొబైల్‌పై 8 బ్యాంక్ ఆఫర్స్... త్వరపడండి

ఒప్పో కే10 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ పోర్ట్‌రైట్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో నైట్, ఫోటో, వీడియో, పోర్ట్రెయిట్, ఎక్స్‌పర్ట్, ఎక్స్‌ట్రా HD, పనోరమా, టైమ్‌లాప్స్, స్లో మోషన్, టెక్స్ట్ స్కానర్, గూగుల్ లెన్స్, స్టిక్కర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఫోటో, వీడియో, పనోరమిక్, పోర్ట్రెయిట్, నైట్, టైమ్‌లాప్స్, స్టిక్కర్ ఫీచర్స్ ఉన్నాయి.

Moto G82 5G: స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా... రూ.19,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్

ఒప్పో కే10 5జీ స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.3, వైఫై లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మెమొరీ కార్డుతో స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు. మిడ్‌నైట్ బ్లాక్, ఓషియన్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Mobile News, Mobiles, Oppo, Smartphone

ఉత్తమ కథలు