హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oppo: పాస్‌వర్డ్‌ లేకుండా లాగిన్ టెక్నాలజీపై ఒప్పో ప్రయోగాలు.. దీనితో యూజర్లకు మరింత సేఫ్టీ..

Oppo: పాస్‌వర్డ్‌ లేకుండా లాగిన్ టెక్నాలజీపై ఒప్పో ప్రయోగాలు.. దీనితో యూజర్లకు మరింత సేఫ్టీ..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Oppo: ఒక్కోసారి ఈ పాస్‌వర్డ్స్‌ (Passwords) మర్చిపోవడం వల్ల యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ప్రతిసారీ లాగిన్ అవడం వల్ల సెక్యూరిటీకి ముప్పు వాటిల్లుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఈ రోజుల్లో యాప్స్ (Apps), వెబ్‌సైట్స్‌ (Websites) యాక్సెస్ చేయాలంటే వాటిలో లాగిన్ అవ్వక తప్పడం లేదు. దీనివల్ల చాలా అకౌంట్స్‌ క్రియేట్ చేసి చాలా చోట్ల లాగిన్‌ కావాల్సి వస్తోంది. ఒక్కోసారి ఈ పాస్‌వర్డ్స్‌ (Passwords) మర్చిపోవడం వల్ల యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ప్రతిసారీ లాగిన్ అవడం వల్ల సెక్యూరిటీకి ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ (Google), యాపిల్ (Apple) వంటి కంపెనీలు పాస్‌వర్డ్ ఉపయోగించాల్సిన అవసరం లేని లాగిన్ మెథడ్‌ను తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీదారు ఒప్పో (Oppo) కూడా ఇదే బాట పట్టింది.

గూగుల్, యాపిల్ కంపెనీలు వంటి సంస్థలు పాస్‌వర్డ్‌లెస్ అథెంటికేషన్ లేదా లాగిన్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పని ప్రారంభించాయి. తాజాగా ఒప్పో కూడా పాస్‌వర్డ్‌లెస్ (Passwordless) లాగిన్ టెక్నాలజీని యూజర్లకు పరిచయం చేసేందుకు ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్‌లైన్ (FIDO) అలయన్స్‌లో చేరింది. పాస్‌వర్డ్‌లెస్ టెక్నాలజీతో సాంప్రదాయ పాస్‌వర్డ్ ఆధారిత అథెంటికేషన్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అలానే యూజర్లు వివిధ అకౌంట్స్, సర్వీసులు, ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా, మరింత సౌకర్యంగా, సురక్షితంగా లాగిన్ అవ్వగలుగుతారు.

* టెక్నాలజీ సపోర్ట్

అలయన్స్ మెంబర్‌గా ఉన్న ఒప్పో పాస్‌వర్డ్‌లెస్ లాగిన్‌ల కోసం లేటెస్ట్ FIDO ప్రమాణాల అభివృద్ధి, అమలుకు సపోర్ట్ అందిస్తుంది. వివిధ సేవల్లో పాస్‌వర్డ్-ఓన్లీ లాగిన్‌లపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు FIDO అథెంటికేషన్ సర్టిఫికెట్స్‌ అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి అలయన్స్‌లోని ఇతర సభ్యులతో కలిసి పని చేస్తుంది. అంతేకాదు, ఒప్పో ఫిడో ద్వారా నిర్వచించిన బేసిక్ పబ్లిక్ పాస్‌కీ క్రిప్టోగ్రఫీ, ప్రోటోకాల్స్‌ను ఉపయోగించి వివిధ సర్వీసెస్‌లో యూజర్లకు ఫాస్ట్, యూజర్-ఫ్రెండ్లీ, సెక్యూర్ సైన్-ఇన్‌ను ఆఫర్ చేస్తుంది.

ఇది కూడా చదవండి : వాట్సప్‌లో బయటపడ్డ ప్రమాదకరమైన బగ్... మీరు వెంటనే ఇలా చేయండి

FIDO లాగిన్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను అన్ని డిజిటల్ అకౌంట్స్‌కి వన్-స్టాప్ లాగిన్ మీడియంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఫోన్ 4/6-డిజిట్స్ పాస్‌కోడ్, ఫింగర్ ID లేదా ఫేస్ IDని ఉపయోగించి జీమెయిల్ లేదా Outlook అకౌంట్‌కు సైన్ ఇన్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అలాగే దీనివల్ల తక్కువ టైపింగ్, పాస్‌వర్డ్‌లను తక్కువ గుర్తుపెట్టుకోవడం, పాస్‌వర్డ్‌లను రీటైప్ చేయడం వంటి తలనొప్పులన్నీ తొలగిపోతాయి.

* FIDO స్టాండర్డ్స్

డిజిటల్ లాగిన్స్‌ మరింత సురక్షితంగా మార్చేందుకు FIDO గత కొన్ని ఏళ్లుగా కృషి చేస్తోంది. ఈ సంస్థలో జాయిన్ అయిన కంపెనీలు సరికొత్త సెక్యూర్ లాగిన్ మెథడ్స్‌ను టెస్టింగ్ చేయడంతో పాటు వాటిపై పరిశోధన కూడా జరుగుతున్నాయి. యాపిల్, గూగుల్ , మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్ డెవలప్ చేయడంలో యాక్టివ్‌గా పాల్గొంటున్నాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ ID వంటి వివిధ రకాల బయోమెట్రిక్ ఫీచర్లు పాస్‌వర్డ్‌లెస్ లాగిన్ టెక్నాలజీలకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Oppo, Smartphones, Tech news

ఉత్తమ కథలు