హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oppo Find X5: ఒప్పో ఫైండ్ ఎక్స్ ఫోన్లలో అదిరిపోయే సెక్యూరిటీ​ ఫీచర్​.. సీక్రెట్​ కెమెరాలను గుర్తించగలిగే సామర్థ్యం..

Oppo Find X5: ఒప్పో ఫైండ్ ఎక్స్ ఫోన్లలో అదిరిపోయే సెక్యూరిటీ​ ఫీచర్​.. సీక్రెట్​ కెమెరాలను గుర్తించగలిగే సామర్థ్యం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫైండ్​ ఎక్స్​ ఫోన్​లో ఒప్పో కంపెనీ అనేక సెక్యూరిటీ ఫీచర్లను చేర్చింది. సీక్రెట్​ కెమెరాలను గుర్తించడంలో సహాయపడే కొత్త టూల్​ను అందించింది.

ఫిబ్రవరి 24న జరిగిన MWC 2022 ఈవెంట్​లో ఒప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫైండ్ X 5 సీరీస్​ను లాంచ్(Launch)​ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫైండ్​ ఎక్స్​ 5 సీరీస్​లో ఫైండ్​ ఎక్స్​ 5, ఫైండ్​ ఎక్స్​ 5 అనే రెండు ఫ్లాగ్​షిప్​ ఫోన్లు రిలీజయ్యాయి. ఈ రెండు ఫోన్​లో అదిరిపోయే ఫీచర్లను(Features) అందించింది. ముఖ్యంగా, వీటిలోని కెమెరా క్వాలిటీ స్మార్ట్​ఫోన్​ ప్రియులను ఆకట్టుకుంటోంది. మరోవైపు, ఫైండ్​ ఎక్స్​ ఫోన్​లో అనేక సెక్యూరిటీ ఫీచర్లను చేర్చింది. సీక్రెట్​ కెమెరాలను(Secret Camara గుర్తించడంలో సహాయపడే కొత్త టూల్​ను అందించింది. ఈ ఫీచర్​ ఇప్పటివరకు ఏ ఫోన్​లోనూ లేకపోవడం గమనార్హం. ఒప్పో ఫైండ్​ ఎక్స్​ సిరీస్​ కలర్​ ఓఎస్​పై పనిచేస్తుంది. ఈ కలర్ ఓఎస్​ను ఒప్పో తన ఇతర మోడళ్లలో సైతం సమీప భవిష్యత్తులో అందించే అవకాశం ఉంది.

ఇటీవలి కాలంలో అన్ని స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థలు హార్డ్‌వేర్ ఫ్రంట్‌లో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఒప్పో మాత్రం వాటికి భిన్నంగా సాఫ్ట్‌వేర్ స్థాయిలో మార్పులు చేస్తోంది. ఒప్పో దాని ఇంటర్నల్​ యాప్ స్టోర్ అయిన ఒప్పో యాప్ మార్కెట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగల హిడెన్ కెమెరా డిటెక్షన్ యాప్ సహాయంతో సీక్రెట్​ కెమెరా ఫీచర్‌ను కూడా అందిస్తోంది. మీరు మీ ఒప్పో ఫైండ్​ ఎక్స్​ 5 ఫోన్​లో హిడెన్​ కెమెరా డిటెక్షన్​ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఏదైనా సీక్రెట్​ కెమెరా కోసం స్కాన్ చేయవచ్చు. దీనికోసం మీ డివైజ్​లోని వైఫై, మొబైల్ హాట్‌స్పాట్ ఫీచర్‌ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది.

ఈ ఫీచర్​ వర్క్​ అవ్వడానికి గదిలోని లైట్లను ఆన్ చేసి, ఆఫ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా, గదిలో లేదా మీ పరిసరాల్లో సీక్రెట్​ కెమెరాలు ఉన్నాయో లేదో యాప్​ గుర్తిస్తుంది. దీనికి గాను ఈ యాప్ ఇన్‌ఫ్రారెడ్ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ హిడెన్ కెమెరా యాప్ మీ చుట్టూ ఉన్న స్పై కెమెరాను గుర్తిస్తుంది. మీరు సీక్రెట్​ కెమెరాకు దగ్గరగా ఉంటే అది మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. తద్వారా, యూజర్ల ప్రైవసీని కాపాడుతుంది.

హిడెన్​ కెమెరా డిటెక్షన్​ యాప్​ సహాయంతో..

ప్రస్తుతం, చైనాలోని ఫైండ్ ఎక్స్​ 5 వేరియంట్లలో హిడెన్ డిటెక్షన్ కెమెరా యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ హిడెన్​ డిటెక్షన్​ కెమెరా ఫీచర్​ను గ్లోబల్ వేరియంట్లలో ఎప్పుడు అందిస్తారనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు. కాగా, ఫైండ్​ ఎక్స్​ 5 స్మార్ట్​ఫోన్​ 6.7 ఇంచుల క్వాడ్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేను కలిగి ఉంటుంది. ఇది క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 8 జనరల్​ 1 ఎస్​వోసీ ప్రాసెసర్​పై పనిచేస్తుంది. దీనిలో ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్​ను అందించింది. ఈ సెటప్​లో 50 ఎంపీ ప్రైమరీ, 50 ఎంపీ సెకండరీ, 13 ఎంపీ టెర్షియరీ సెన్సార్​, 32 ఎంపీ ఫ్రంట్​ కెమెరాలను అందించింది.

Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Oppo, Technology

ఉత్తమ కథలు