OPPO INDIA CONDUCTED 5G NETWORK TRIAL FOR RENO 6 SERIES SMARTPHONES AT JIO 5G LAB SS GH
5G Trial: జియోతో కలిసి 5G నెట్వర్క్ ట్రయల్స్ నిర్వహించిన ఒప్పో... రెనో 6 సిరీస్‌పై ప్రయోగం
5G Trial: జియోతో కలిసి 5G నెట్వర్క్ ట్రయల్స్ నిర్వహించిన ఒప్పో... రెనో 6 సిరీస్‌పై ప్రయోగం
(image: Oppo India)
5G Trial | ఇటీవల ఒప్పో రెనో 6 సిరీస్ స్మార్ట్ఫోన్లు లాంఛ్ అయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్ల 5జీ ట్రయల్స్ జియో ల్యాబ్‌లో నిర్వహించినట్టు ఒప్పో ఇండియా ప్రకటించింది.
భారతదేశంలో 5జీ నెట్వర్క్ తీసుకురావడానికి పలు టెలికాం ఆపరేటర్లు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో సైతం దీనిపై కన్నేసింది. ఈ సంస్థ తాజాగా టెలికాం సర్వీస్ జియో సహకారంతో రెనో 6 సిరీస్ మొబైల్స్ పై ఒక 5జీ స్టాండలోన్ నెట్వర్క్ ట్రయల్ నిర్వహించింది. తమ 5జీ ల్యాబ్‌లో నిర్వహించిన ఈ ట్రయల్ అత్యంత సానుకూల ఫలితాలను ఇచ్చిందని ఒప్పో సంస్థ ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పలు నగరాల్లో జియో, ఇతర టెలికాం సర్వీసులు 5జీ నెట్వర్క్ ట్రయల్స్ ప్రారంభించాయి. చైనీస్ టెలికాం పరికరాల కంపెనీలతో భాగస్వామ్యం లేని టెలికాం ఆపరేటర్లకు మాత్రమే 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతులు ఉన్నాయి. ఈ మేరకు స్పెక్ట్రం లోని మిడ్-బ్యాండ్ (3.2 GHz - 3.67 GHz), మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ (24.25 GHz-28.5 GHz) లను టెలికాం విభాగం కేటాయించింది. అలాగే స్పెక్ట్రంలోని సబ్-గిగాహెర్ట్జ్ బ్యాండ్ (700 GHz) కేటాయించింది.
ఈ విషయంపై ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ తస్లీమ్ ఆరిఫ్ మాట్లాడారు. 5జీ నెట్‌వర్క్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒప్పో కంపెనీ నిరంతరాయంగా కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. లోతైన పరిశోధన చేసేందుకు జియోతో కలిసి రెనో6 సిరీస్ పై 5జీ నెట్వర్క్ ట్రయల్ నిర్వహించామని చెప్పారు. వినియోగదారులకు మెరుగైన 5జీ ఎక్స్పీరియన్స్ అందించే దిశగా తాము పని చేస్తున్నామని తెలిపారు. రెనో 6 సిరీస్ మొబైల్స్ పై జియో 5జీ నెట్వర్క్ విజయవంతంగా వాలిడేట్ అయ్యిందని ఆరిఫ్ వివరించారు. అత్యాధునిక టెక్నాలజీని తమ యూజర్లకు అందుబాటులోకి తేవడం కోసం సంస్థ కృషిచేస్తోందన్నారు.
భారతదేశంలో జరిగే 5జీ ట్రయల్స్ అన్నీ కూడా నాన్-స్టాండ్-అలోన్ మోడల్స్ అని ఆరిఫ్ తెలిపారు. కానీ తమ ఒప్పో సంస్థ స్టాండ్-అలోన్ ప్లాట్‌ఫామ్‌లపై.. అనగా ప్రామాణికమైన 5జీ సెటప్‌తో మొబైల్స్ పై ట్రయల్స్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పర్యావరణానికి హాని కలిగించని 5జీ వ్యవస్థను జియో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. రెనో 6 మొబైల్స్ పరీక్షించడానికి అనువైన వాతావరణాన్ని జియో 5G స్టాండ్-అలోన్ నెట్వర్క్ అందించిందని వెల్లడించారు. ఇకపోతే ఒప్పో రెనో 6 5జీ, రెనో 6ప్రో 5జీ వేరియంట్లు ఇటీవల భారతదేశంలో విడుదలయ్యాయి. ఈ 5జీ ఫోన్స్ జూలై 20వ తేదీ నుంచి అమ్మకానికి వచ్చాయి. వీటి ధర రూ.29,900 - రూ.39,990 రేంజ్లో ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.