ఇండియాలో లాంఛైన ఒప్పో ఫైండ్ ఎక్స్!

ఒప్పో హై ఎండ్ మోడల్‌లో ఫైండ్ ఎక్స్ మొబైల్‌ని రిలీజ్ చేసింది. ధర రూ. 59,990.

news18-telugu
Updated: July 12, 2018, 3:32 PM IST
ఇండియాలో లాంఛైన ఒప్పో ఫైండ్ ఎక్స్!
(image: News18.com)
  • Share this:
మొత్తానికి ఒప్పో కంపెనీ ఇండియాలో ఫైండ్ ఎక్స్ మోడల్‌ని రిలీజ్ చేసింది. ఆగస్ట్ 3న సేల్స్ మొదలవుతాయి. ఫ్లిప్‍కార్ట్‌లో జూలై 25 నుంచి ప్రీ-ఆర్డర్స్ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా లభించనుంది. ఈ ఫోన్‌ను గత నెలలో ప్యారిస్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆవిష్కరించారు. 6.4 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్‌ స్క్రీన్ టు బాడీ రేషియో 93.8శాతం. 4జీ, ఎల్‌టీఈ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, టైప్ సీ కనెక్టర్, ఓటీజీ సపోర్ట్, ఏఐ సపోర్ట్‌తో 3డీ కెమెరా, ఫేస్ అన్‌లాక్ ఈ ఫోన్ ఫీచర్లు.

ఒప్పో ఫైండ్ ఎక్స్ స్పెసిఫికేషన్స్

డిస్‌‌ప్లే: 6.4 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 2340x1080 పిక్సెల్స్
ర్యామ్: 8 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 256 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్
రియర్ కెమెరా: 16+20 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్ 3డీ కెమెరా
బ్యాటరీ: 3,700 ఎంఏహెచ్
ఓఎస్: ఆండ్రాయిడ్ 8.1, కలర్ఓఎస్ 5.1
Published by: Santhosh Kumar S
First published: July 12, 2018, 3:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading