OPPO FIND N FOLDABLE SMARTPHONES RENDERS KEY SPECS LEAKED ALL DETAILS GH VB
Oppo Find N: డిసెంబర్ 15న ఒప్పో నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. లీకైన స్పెసిఫికేషన్ల వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Oppo Find N: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఒప్పో ఫైండ్ ఎన్ (Oppo Find N) పేరుతో డిసెంబర్ 15న దీన్ని ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్దమవుతోంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్(smartphone) తయారీ సంస్థ ఒప్పో నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఒప్పో ఫైండ్ ఎన్(Oppo Find N) పేరుతో డిసెంబర్ 15న దీన్ని ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్దమవుతోంది. ఈ మేరకు ఒప్పో గత వారమే ప్రకటించింది. అయితే ఇది అధికారికంగా లాంచ్ అవ్వక ముందే ముఖ్యమైన ఫీచర్లు, హై -రిజల్యూషన్(High Resolution) రెండర్లు ఆన్లైన్(Online)లో లీకయ్యాయి. లీకేజీని బట్టి చూస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, సిల్వర్(silver) వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది. దీని వెనుకవైపు ట్రిపుల్ కెమెరాసెటప్(Triple Camera setup) ను అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెండు సెల్ఫీ సెన్సార్ కెమెరాలను చేర్చనుంది. సెకండరీ డిస్ప్లేలో ఒక కెమెరాను, మెయిన్ ప్యానెల్‌లోని హోల్-పంచ్ కటౌట్ లోపల మరో కెమెరాను అమర్చనుంది.
ఈ సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై ఒప్పో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, వన్‌ప్లస్ వ్యవస్థాపకుడు పీటీ ల్యూ మాట్లాడుతూ ‘‘ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం చాలా సులభం. ఫైండ్ ఎన్ ద్వారా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో ఉండే ప్రధాన సమస్యలను పరిష్కరించనున్నాం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ఫోన్ల కంటే అత్యుత్తమ డిస్ప్లే, డిజైన్ ఫీచర్లతో దీన్ని రూపొందించాం.” అని పేర్కొన్నారు.
ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించిన టీజర్ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. 15 సెకన్ల వీడియోలో దీనికి సంబంధించిన ఇన్వార్డ్ ఫోల్డింగ్ డిజైన్‌ను చూపించారు. దీని అంచులు సన్నగా ఉండనున్నాయి. ఇది ఫోల్డబుల్ డిస్ప్లేలను కవర్ చేయనుంది. శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ తరహాలో దీనిలో కూడా గుండ్రటి మెటల్ డిజైన్‌ను అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది.
క్వాల్కామ్ స్నాపడ్రాగన్ 888 చిప్సెట్తో..
లీకేజీలను బట్టి చూస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 60Hz ఎక్స్టర్నల్ డిస్ప్లేతో వస్తుంది. అయితే దీని మెయిన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది అడప్టివ్ రిఫ్రెష్ రేట్, మెరుగైన పవర్ మేనేజ్మెంట్ని అందించే LTPO ప్యానెల్‌తో వస్తుంది. ఒప్పో ఫైండ్ ఎన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888తో పనిచేస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ ఫ్లిప్ 3లో కూడా ఇదే ప్రాసెసర్లను అందించారు.
ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 50 -మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు 16- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 13 -మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ కెమెరాలతో వస్తుంది. దీని లోపలి స్క్రీన్‌పై, సెల్ఫీల కోసం 32 -మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను చేర్చనుంది.
33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4,500mAh బ్యాటరీ యూనిట్‌ను ఈ డివైజ్‌లో సంస్థ అందించనుంది. ఇది 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్లో మొత్తం రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లభించనుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ మోడల్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.