ఒప్పో నుంచి మరో రెండు ఫోన్లు వచ్చేశాయి!

ఒప్పో కంపెనీ మరో రెండు ఫోన్లను ఇండియాలో లాంఛ్ చేసింది. ఒప్పో ఎఫ్9 ప్రో, ఎఫ్9 మోడల్స్ కంపెనీ స్టోర్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా లభిస్తాయి.

news18-telugu
Updated: August 21, 2018, 4:38 PM IST
ఒప్పో నుంచి మరో రెండు ఫోన్లు వచ్చేశాయి!
(Image: Oppo)
  • Share this:
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో మరో రెండు ఫోన్లతో ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. ఈ రెండు ఫోన్ల ర్యామ్ తప్ప మిగతా స్పెసిఫికేషన్లు ఒకేలా ఉన్నాయి. నాచ్‌ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్ స్కీన్-టు-బాడీ రేషియో 90.8%. ఫోన్ మెమొరీ 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఒప్పో సొంత ఫీచర్ అయిన వూక్ ఫ్లాష్ ఛార్జ్ కేవలం ఎఫ్9 ప్రోను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

ఈ రెండు ఫోన్లకు ఇవాళ్టి నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్స్‌లో ప్రీ-ఆర్డర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లో ప్రీ-ఆర్డర్ చేసినవారికి 3డీ మెటాలిక్ బాటిల్ లభిస్తుంది. ఇక ఆగస్ట్ 31 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు రిలయెన్స్ డిజిటల్, క్రోమా, పూర్విక, సంగీత మొబైల్స్, విజయ్ సేల్స్, లాట్, బిగ్‌ సీ లాంటి ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.

ఒప్పో ఎఫ్9 ప్రో, ఎఫ్9 కొన్నవారికి 3.2 టీబీ 4జీ డేటాతో పాటు రూ.4,900 విలువైన ఇతర బెన్‌ఫిట్స్ లభిస్తాయి. కంపెనీ వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకుపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి.

ఒప్పో ఎఫ్ 9 ప్రో స్పెసిఫికేషన్స్


డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‍డీ+, 2.0 గిగాహెర్జ్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, 2,340 x 1,080 పిక్సెల్స్
ర్యామ్: 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టాకోర్
రియర్ కెమెరా: 16+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, కలర్ ఓఎస్ 5.2
కలర్స్: రెడ్ సన్‌షైన్, ట్విలైట్
ధర: రూ.23,990

ఒప్పో ఎఫ్ 9 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‍డీ+, 2.0 గిగాహెర్జ్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, 2,340 x 1,080 పిక్సెల్స్
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టాకోర్
రియర్ కెమెరా: 16+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, కలర్ ఓఎస్ 5.2
కలర్స్: రెడ్ సన్‌షైన్, ట్విలైట్
ధర: రూ.19,990

ఇది కూడా చదవండి:

ఇండియాలో లాంఛైన నోకియా 6.1 ప్లస్
First published: August 21, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>