హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OPPO F21s Pro 5G: పాపులర్ ప్రాసెసర్‌తో రిలీజైన ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్

OPPO F21s Pro 5G: పాపులర్ ప్రాసెసర్‌తో రిలీజైన ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్

OPPO F21s Pro 5G: పాపులర్ ప్రాసెసర్‌తో రిలీజైన ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్
(image: Oppo India)

OPPO F21s Pro 5G: పాపులర్ ప్రాసెసర్‌తో రిలీజైన ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ (image: Oppo India)

OPPO F21s Pro 5G | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) వచ్చేసింది. ఇందులో పాపులర్ 5జీ ప్రాసెసర్ ఉండటం విశేషం. అమెజాన్‌లో సేల్ ప్రారంభమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఒప్పో ఇండియా భారతదేశంలో ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో, ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ మోడల్స్‌ రిలీజ్ చేసింది. వీటిలో ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ (Oppo F21s Pro 5G) స్మార్ట్‌ఫోన్ పాపులర్ ప్రాసెసర్‌తో రిలీజైంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది. దీంతో పాటు 64మెగాపిక్సెల్ ఏఐ పోర్ట్‌రైట్ కెమెరా, డ్యూయెల్ ఆర్బిట్ లైట్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో రిలీజైంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉన్న ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ ధర రూ.25,999. అమెజాన్‌లో ప్రీ ఆర్డర్ సేల్ ప్రారంభమైంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే 10 శాతం తగ్గింపు పొందొచ్చు. రూ.3,000 వరకు అదనంగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ స్పెసిఫికేషన్స్

ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల ఈ పాపులర్ 5జీ ప్రాసెసర్‌తో చాలా ఫోన్లు రిలీజ్ అయ్యాయి. అందులో మోటోరోలో జీ62, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, ఒప్పో ఎఫ్ 21ప్రో 5జీ, ఐకూ జెడ్6, పోకో ఎక్స్4 ప్రో మొబైల్స్‌ ఉన్నాయి.

Nothing Phone 1: రూ.12,000 లోపే నథింగ్ ఫోన్ 1... బిగ్ బిలియన్ సేల్‌లో ఇలా కొనండి

ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ఆండ్రాయిడ్ 12 + కలర్‌ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా మరో 5జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే మొత్తం 13జీబీ ఉపయోగించుకోవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డుతో స్టోరేజ్ కూడా పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కూడా 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డాన్‌లైట్ గోల్డ్, స్టార్‌లైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.

5G Smartphone: రూ.10 వేల లోపే 5జీ స్మార్ట్‌ఫోన్... బిగ్ బిలియన్ సేల్‌లో తొలిసారి భారీ డిస్కౌంట్

ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మైక్రోలెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో నైట్, ఫోటో, వీడియో, ప్రో, పనో, పోర్ట్రెయిట్, టైమ్-లాప్స్, స్లోమో, టెక్స్ట్ స్కానర్, గూగుల్ లెన్స్, ఎక్స్‌ట్రా హెచ్‌డీ, మైక్రోలెన్స్, మ్యాక్రో, స్టిక్కర్, డ్యూయెల్ వ్యూ వీడియో ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఫోటో, వీడియో, పనో, పోర్ట్రెయిట్, నైట్, టైమ్-లాప్స్, స్టిక్కర్ ఫీచర్స్ ఉన్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon Great Indian Festival Sale, Oppo, Smartphone

ఉత్తమ కథలు