Oppo F19s: ఒప్పో ఎఫ్19ఎస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర రూ.20,000 లోపే... సేల్ మొదలైంది

Oppo F19s: ఒప్పో ఎఫ్19ఎస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర రూ.20,000 లోపే... సేల్ మొదలైంది (image: Oppo India)

Oppo F19s | ఒప్పో నుంచి ఒప్పో ఎఫ్19ఎస్ (Oppo F19s) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఈ కొత్త మొబైల్ రిలీజ్ అయింది. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    మీరు రూ.20,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఒప్పో నుంచి ఇండియన్ మార్కెట్‌కు మరో మొబైల్ వచ్చింది. ఒప్పో ఎఫ్19ఎస్ (Oppo F19s) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. ఇప్పటికే ఒప్పో ఎఫ్19 సిరీస్‌లో (Oppo F19 Series) ఒప్పో ఎఫ్19, ఒప్పో ఎఫ్19 ప్రో, ఒప్పో ఎఫ్19 ప్రో+ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే సిరీస్‌లో ఒప్పో ఎఫ్19ఎస్ మోడల్ కూడా వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఒప్పో ఎఫ్19ఎస్ ధర రూ.19,990. కేవలం 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రిలీజ్ అయింది. రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఇప్పటికే రెడ్‌మీ 10 ప్రో మ్యాక్స్, రెడ్‌మీ 10 ప్రో, రియల్‌మీ 8 ప్రో, పోకో ఎక్స్3 ప్రో లాంటి స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి.

    ఒప్పో ఎఫ్19ఎస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగానే సేల్ కూడా మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి లాంఛింగ్ ఆఫర్స్ కూడా ప్రకటించింది ఒప్పో. యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనాలనుకునేవారికి అదనంగా రూ.1,500 డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది. ఒప్పో ఎఫ్19ఎస్ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి రూ.1,999 విలువైన ఒప్పో ఎన్‌కో డబ్ల్యూ11 బ్లూటూత్ ఇయర్‌బడ్స్ రూ.999 ధరకే లభిస్తుంది.

    iQOO Z5: అదిరే ఫీచర్స్‌తో ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... తొలి సేల్‌లో రూ.3,000 తగ్గింపు


    ఒప్పో ఎఫ్19ఎస్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. 6జీబీ+128జీబీ వేరియంట్ మాత్రమే రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఒప్పో ఎఫ్19ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వెనుకవైపు 48మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

    Oppo A53s: ఒప్పో నుంచి అదిరిపోయే ఆఫర్... రూ.12 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్

    ఒప్పో ఎఫ్19ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఐదు నిమిషాలు ఛార్జింగ్ చేస్తే ఐదున్నర గంటల టాక్‌టైమ్ లభిస్తుందని ఒప్పో చెబుతోంది. డ్యూయెల్ బ్యాండ్ వైఫై, అండర్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.0 లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఒప్పో ఎఫ్19ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోయింగ్ గోల్డ్, గ్లోయింగ్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: