చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో ఇండియాలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసింది. ఒప్పో ఎఫ్19 మోడల్‌ను పరిచయం చేసింది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 48మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే 54% ఛార్జింగ్ అవుతుంది. 72 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఇక లాంఛ్ ఆఫర్లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కార్డులతో కొంటే 7.5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జీరో డౌన్‌పేమెంట్‌తో ఈ ఫోన్ కొనొచ్చు. ఇక ఎఫ్19 స్మార్ట్‌ఫోన్‌తో కలిపి కొంటే ఒప్పో బ్యాండ్ స్టైల్ రూ.2499 ధరకు, ఒప్పో ఎంకో డబ్ల్యూ11 రూ.1299 ధరకు, ఒప్పో ఎంకో డబ్ల్యూ31 రూ.2499 ధరకు కొనొచ్చు. ఒప్పో అప్‌గ్రేడ్‌లో భాగంగా 70 శాతం బయ్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఒప్పో ఎఫ్19 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనొచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కనిపిస్తుంది. ఏప్రిల్ 9న ప్రీ ఆర్డర్స్ మొదలౌతాయి.