Oppo F17 Pro | ఒప్పో నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఒప్పో ఎఫ్17, ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్ఫోన్లతో పాటు ఒప్పో ఎన్కో డబ్ల్యూ51 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ని రిలీజ్ చేసింది కంపెనీ.
ఒప్పో ఇటీవల బాగా హైప్ చేసిన ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఒప్పో ఎఫ్17 మోడల్ని కూడా రిలీజ్ చేసింది. అందరూ ఊహించినట్టుగానే రూ.25,000 లోపే ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 8జీబీ+128జీబీ వేరియంట్లో మాత్రమే రిలీజైంది. ధర రూ.22,990. ఒప్పో ఎఫ్17 ధర వెల్లడించలేదు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే, వెనుకవైపు క్వాడ్ కెమెరా, ఫ్రంట్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఒప్పో ఎఫ్17, ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్ఫోన్లతో పాటు ఒప్పో ఎన్కో డబ్ల్యూ51 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ కూడా పరిచయం చేసింది కంపెనీ. ఒప్పో ఎన్కో డబ్ల్యూ51 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర రూ.4,999. ఇక ఒప్పో ఎఫ్17 ప్రో ప్రీ ఆర్డర్ మొదలైంది. సెప్టెంబర్ 7న సేల్ ప్రారంభం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.