ఒప్పో నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లు ఇండియాలో రిలీజ్ కాబోతున్నాయి. ఒప్పో ఎఫ్17, ఒప్పో ఎఫ్17 ప్రో మోడల్స్‌ని కంపెనీ పరిచయం చేయనుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు డిజిటల్ లాంఛ్ ఈవెంట్లో ఈ ఫోన్లు లాంఛ్ కానున్నాయి. ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్లకు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అందరికీ తెలిసినవే. 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే, 6 కెమెరాలు, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఒప్పో ఎఫ్17 ప్రో ధర రూ.25,000 లోపు ఉంటుందని అంచనా. ఇక ఒప్పో ఎఫ్17 ధర అంతకన్నా తక్కువే ఉంటుంది. రాత్రి 7 గంటలకు జరిగే రిలీజ్ ఈవెంట్లో ఇతర స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధరల వివరాలు తెలుస్తాయి. ఇదే ఈవెంట్లో ఒప్పో ఎఫ్17, ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్ఫోన్లతో పాటు ఒప్పో ఎన్కో డబ్ల్యూ51 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ కూడా లాంఛ్ చేయనుంది కంపెనీ. ఒప్పో సంస్థకు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైవ్ చూడొచ్చు.
Get ready to vibe 🤙🏼 with megastars like @raftaarmusic and @HARRDYSANDHU as OPPO F17 Series presents the First Ever Flauntastic Online Music Launch! 🎙️🎫
So, what are you waiting for? Put on your dancing shoes and join us LIVE on 2nd September at 7pm! 💫 #FlauntItYourWay pic.twitter.com/NPoPP0iglm
— OPPO India (@oppomobileindia) August 27, 2020
ఒప్పో ఎఫ్17 ప్రో స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ95
రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000ఎంఏహెచ్, 30వాట్ VOOC ఫ్లాష్ ఛార్జ్ 4.0
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: మ్యాటీ బ్లాక్, మ్యాజిక్ బ్లూ, మెటాలిక్ వైట్
ధర: సుమారు రూ.25,000
Redmi 9A: బ్యాటరీ ఎక్కువ... ధర తక్కువ... రెడ్మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది
Nokia 5.3: రెడ్మీ, రియల్‌మీకి పోటీగా నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్... సేల్ ప్రారంభం
ఒప్పో ఎఫ్17 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: 6.44 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్
రియర్ కెమెరా: 16+8+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000ఎంఏహెచ్, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: నేవీ బ్లూ, డైనమిక్ ఆరెంజ్, క్లాసిక్ సిల్వర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android 10, Oppo, Smartphone