OPPO F11 Pro: రూ. 25,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఎందుకంటే...

OPPO F11 Pro | మోటార్ సాయంతో పైకి వచ్చేలా ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతో, తక్కువ లైటింగ్‌లో కూడా గొప్ప చిత్రాలను తీసేలా ఫోన్ స్క్రీన్ ఫ్లాష్ ఉంటుంది. మధ్యలో ఏర్పాటు చేసిన రైజింగ్ కెమెరాతో సెల్ఫీలు స్పష్టంగా తీసుకోవచ్చు.

news18-telugu
Updated: April 11, 2019, 1:40 PM IST
OPPO F11 Pro: రూ. 25,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఎందుకంటే...
OPPO F11 Pro: రూ. 25,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఎందుకంటే... (image: Oppo)
  • Share this:
OPPO F11 Pro... స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఓ సంచలనం. కారణం... రూ.25,000 లోపే స్మార్ట్ ఫీచర్స్ అందించడం ఒప్పో ఎఫ్11 ప్రో ప్రత్యేకత. రూ. 24,999 ధరకే ఒప్పో అందిస్తున్న లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్... ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ని అత్యున్నత స్థాయికి చేర్చుతోందనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఇదంతా నిజమేనా? ఒప్పో ఎఫ్11 ప్రో ప్రత్యేకతలేంటీ? కస్టమర్లకు OPPO F11 Pro ఎందుకు అంతగా నచ్చుతోంది? బెస్ట్ ఆప్షన్‌గా ఎందుకు నిలుస్తోంది? ఈ ఫోన్‌లో ఉన్న అత్యుత్తమ ఫీచర్లు ఏంటీ? తెలుసుకోండి.

1. కెమెరా: DSLR స్థాయి క్వాలిటీ ఫోటోలను తీయగలిగే స్మార్ట్‌ఫోన్‌ ఎంపిక చేసుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. 48 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన OPPO F11 Pro సరిగ్గా ఇలాంటిదే. ప్రత్యేకమైన మ్యాపింగ్ కర్వ్, పిక్సెల్ గ్రేడ్ కలర్ మ్యాపింగ్ అల్గారిథంతో పాటు ఒప్పోకు మాత్రమే ప్రత్యేకమైన AI ఇంజిన్, అల్ట్రా క్లియర్‌ ఫీచర్లు అద్భుతమైన ఫోటోలు తీసేందుకు ఉపయోగపడుతున్నాయి. క్రిస్టల్ క్లియర్ పోర్ట్రయిట్ ఎఫెక్ట్‌తో ఫోటోలను అందించగలగడం దీని ప్రత్యేకత.

OPPO F11 Pro Review, OPPO F11 Pro price in india, best smartphone under Rs.25000, OPPO F11 Pro features, OPPO F11 Pro camera, oppo f11 pro, oppo f11 pro camera, oppo f11 pro camera test, oppo f11 pro vs, ఒప్పో ఎఫ్11 ప్రో రివ్యూ, ఒప్పో ఎఫ్11 ప్రో ధర, ఒప్పో ఎఫ్11 ప్రో ఫీచర్స్, ఒప్పో ఎఫ్11 ప్రో కెమెరా, ఒప్పో ఎఫ్11 ప్రో స్పెసిఫికేషన్స్, రూ.25000 లోపు స్మార్ట్‌ఫోన్
image: Oppo

మోటార్‌తో అనుసంధానం చేసిన రైజింగ్ కెమెరా కారణంగా, ఫోటోలను పగలు క్లిక్ చేశారా లేక రాత్రి తీశారా అనే అంశంతో సంబంధం లేకుండా, ఫోకస్ వేగంగా జరుగుతుంది. ఫోటోలు కాంతివంతంగా, స్పష్టంగా ఉంటాయి. మోటార్ సాయంతో పైకి వచ్చేలా ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతో, తక్కువ లైటింగ్‌లో కూడా గొప్ప చిత్రాలను తీసేలా ఫోన్ స్క్రీన్ ఫ్లాష్ ఉంటుంది. మధ్యలో ఏర్పాటు చేసిన రైజింగ్ కెమెరాతో సెల్ఫీలు స్పష్టంగా తీసుకోవచ్చు. ఇదే సమయంలో ఫ్రంట్ కెమెరా ట్రాన్స్‌పరెంట్‌గా రౌండెడ్ కర్వ్ డిజైన్‌తో ఉంటుంది. మిగతా స్మార్ట్‌ఫోన్ల కన్నా ఈ హ్యాండ్‌సెట్‌ భిన్నంగా ఉండటానికి ఇదే కారణం. ఇంక్-వాష్ పెయింటింగ్స్ ఎఫెక్ట్‌ను సృష్టించడానికి వీలుగా నానో ప్రింటింగ్ టెక్నిక్‌ను ఇండస్ట్రీలో అందించిన తొలి కంపెనీగా OPPO నిలుస్తోంది.

OPPO F11 Pro Review, OPPO F11 Pro price in india, best smartphone under Rs.25000, OPPO F11 Pro features, OPPO F11 Pro camera, oppo f11 pro, oppo f11 pro camera, oppo f11 pro camera test, oppo f11 pro vs, ఒప్పో ఎఫ్11 ప్రో రివ్యూ, ఒప్పో ఎఫ్11 ప్రో ధర, ఒప్పో ఎఫ్11 ప్రో ఫీచర్స్, ఒప్పో ఎఫ్11 ప్రో కెమెరా, ఒప్పో ఎఫ్11 ప్రో స్పెసిఫికేషన్స్, రూ.25000 లోపు స్మార్ట్‌ఫోన్
image: Oppo

అందరూ ఎక్కువగా మాట్లాడుకునే పోర్ట్రయిట్ మోడ్ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది ఒప్పో. ఇది మీ ఫోటోలకు ప్రొఫెషనల్ టచ్‌ను అందిస్తుంది. ఫోన్‌లో అంతర్గతంగా ఉన్న బ్యూటీ ఫీచర్‌తో సోషల్ మీడియాలో మీరు మెరిసిపోయేలా ఫోటోలను రూపొందించగలగడం దీని మరో ప్రత్యేకత.

2. బ్యాటరీ లైఫ్: ప్రస్తుత ఉరుకులుపరుగుల జీవన విధానంలో, తక్కువ సమయంలోనే మీరు అనేక పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిలో మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోకుండా చూసుకోవడం కూడా ముఖ్యమైనది. వేగవంతమైన డౌన్‌లోడ్ మరియు తక్కువ ఛార్జింగ్ సమయం కలిగిన OPPO F11 Pro, మీకు సుదీర్ఘ సమయం వినోదాన్ని అందించగలదు. ఇది 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. VOOC 3.0 టెక్నాలజీతో ఫాస్ట్ ఛార్జ్ ఇంటిగ్రేషన్ సౌకర్యం అందిస్తుంది. OPPO F11 Pro స్మార్ట్‌ఫోన్ కెమెరాతో పాటు ఉపయోగించినప్పుడు 15.5 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. 12 గంటల పాటు వీడియో వాచింగ్, 5.5 గంటల గేమ్ ప్లేయింగ్, 12 గంటల పాటు అంతరాయం లేకుండా సంగీతం వినే సౌకర్యం ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ ఫోన్‌లలో ఇవి చాలా అద్భుతమైన ఫీచర్లుగా చెప్పేందుకు ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.
OPPO F11 Pro Review, OPPO F11 Pro price in india, best smartphone under Rs.25000, OPPO F11 Pro features, OPPO F11 Pro camera, oppo f11 pro, oppo f11 pro camera, oppo f11 pro camera test, oppo f11 pro vs, ఒప్పో ఎఫ్11 ప్రో రివ్యూ, ఒప్పో ఎఫ్11 ప్రో ధర, ఒప్పో ఎఫ్11 ప్రో ఫీచర్స్, ఒప్పో ఎఫ్11 ప్రో కెమెరా, ఒప్పో ఎఫ్11 ప్రో స్పెసిఫికేషన్స్, రూ.25000 లోపు స్మార్ట్‌ఫోన్
image: Oppo

3. గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్: ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన లేటెస్ట్ ఆక్టా-కోర్ హీలియో P70 గేమింగ్ చిప్‌సెట్, గేమ్ లవర్స్‌కు ఉత్తమమైన ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది. విజువల్ పరంగా ఎలాంటి ల్యాగ్‌లు లేకుండా, PUBG వంటి హై-ఎండ్ గేమ్‌లను ఆడొచ్చు. 6 GB ర్యామ్+ 64 GB స్టోరేజ్‌లతో సుదీర్ఘమైన, ఉత్తేజితమైన గేమింగ్ సెషన్స్‌ను ఆస్వాదించొచ్చు. ఫోన్ వేడి కాకుండా హీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ అంతర్గతంగా ఏర్పాటు చేసింది ఒప్పో. అందుకే ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీరు గంటల తరబడి గేమ్స్ ఆడినా సరే ఫోన్ వేడెక్కదు.

OPPO F11 Pro Review, OPPO F11 Pro price in india, best smartphone under Rs.25000, OPPO F11 Pro features, OPPO F11 Pro camera, oppo f11 pro, oppo f11 pro camera, oppo f11 pro camera test, oppo f11 pro vs, ఒప్పో ఎఫ్11 ప్రో రివ్యూ, ఒప్పో ఎఫ్11 ప్రో ధర, ఒప్పో ఎఫ్11 ప్రో ఫీచర్స్, ఒప్పో ఎఫ్11 ప్రో కెమెరా, ఒప్పో ఎఫ్11 ప్రో స్పెసిఫికేషన్స్, రూ.25000 లోపు స్మార్ట్‌ఫోన్
image: Oppo

4. డిజైన్: రూ.25,000 లోపు ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌ను డిజైన్ చేసిన తీరు ప్రీమియమ్ ఫినిషింగ్‌తో ఆకట్టుకునే స్థాయిలో ఉంటుంది. చూడ్డానికి అద్భుతంగా ఉండడం మాత్రమే కాదు, హ్యాండ్ గ్రిప్ కూడా చాలా పటిష్టంగా అనిపిస్తుంది. అందుకే మీరు భారీగా అనిపించే ఫోన్ కేస్‌లకు చెక్ పెట్టేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రంగులలో అందుబాటులో ఉంది. అరోరా గ్రీన్ మరియు థండర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌‌తో మీదైన స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చేందుకు అనుకూలంగా ఉంటుంది. OPPO F11 Proలో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉండగా, 90.9 శాతం బాడీ టు స్క్రీన్ రేషియో కలిగి ఉంటుంది. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పైకి వచ్చేలా డిజైన్ చేసిన రైజింగ్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. HD+ వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడానికి తోడ్పడుతుంది. దీనికి అమర్చిన IPS LCD ప్యానెల్, విజువల్స్‌ను 1,080 x 2,340 పిక్సెల్స్‌తో స్పష్టంగా చూపిస్తుంది ఈ ఫోన్.

OPPO F11 Pro Review, OPPO F11 Pro price in india, best smartphone under Rs.25000, OPPO F11 Pro features, OPPO F11 Pro camera, oppo f11 pro, oppo f11 pro camera, oppo f11 pro camera test, oppo f11 pro vs, ఒప్పో ఎఫ్11 ప్రో రివ్యూ, ఒప్పో ఎఫ్11 ప్రో ధర, ఒప్పో ఎఫ్11 ప్రో ఫీచర్స్, ఒప్పో ఎఫ్11 ప్రో కెమెరా, ఒప్పో ఎఫ్11 ప్రో స్పెసిఫికేషన్స్, రూ.25000 లోపు స్మార్ట్‌ఫోన్
image: Oppo

5. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & ఫీచర్స్: పవర్‌ఫుల్ క్లౌడ్ సర్వీస్ ప్యాకేజ్‌తో పాటుగా, డ్రాయర్ మోడ్, సింపుల్ నేవిగేషన్ సిగ్నల్స్, స్మార్ట్ రైడింగ్ మోడ్, ఎఫీషియెంట్ స్మార్ట్ అసిస్టెంట్‌లతో పాటు OPPO F11 ప్రో లో ఇన్-బిల్ట్‌గా ఉన్న AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)... బ్యాక్‌గ్రౌండ్‌ యాప్‌లను ఫ్రీజ్ చేసి, మెమొరీ నిర్వహణను సులభతరం చేస్తుంది. విస్తరించబడిన క్లౌడ్ స్టోరేజ్ స్పేస్ కారణంగా... యూజర్‌లు తమ కాంటాక్ట్స్ మరియు ఫోటోలను డిలెట్ చేయాల్సిన అవసరం ఉండదు. క్లౌడ్ సర్వీసులలో భాగంగా అందిస్తున్న ఇతర అంశాల్లో ఫోటోలు, వీడియోలను సింక్రొనైజ్ చేయడం, ఆల్బమ్ షేరింగ్, బుక్‌మార్క్ సింక్, న్యూస్ సింక్(భారత్‌లో మాత్రమే), కాల్ రికార్డింగ్ సింక్, వైఫై కీ సింక్, ఎస్ఎంఎస్ బ్యాకప్, రీస్టోర్, సాధారణ సిస్టమ్ సెట్టింగ్స్ బ్యాకప్, రీస్టోర్, కాల్ హిస్టరీ బ్యాకప్, రీస్టోర్ వంటివి ఉన్నాయి. అనవసరమైన ప్రమోషన్స్ లేదా అడ్వర్టెయిజ్‌మెంట్ నోటిఫికేషన్స్‌ను నివారించేందుకు, OPPO F11 Pro మీకు OPUSH యాక్సెస్ నిబంధనలను, ఆండ్రాయిడ్ నేటివ్ నోటిఫికేషన్ ప్రాధాన్యతలను పాటిస్తుంది. దీనితో తక్కువ ప్రాధాన్యం ఉండే నోటిఫికేషన్‌లు వాటంతట అవే బ్లాక్ అవుతాయి. OPPO F11 Pro యొక్క స్మార్ట్ డ్యుయెల్ ఛానల్ నెట్వర్క్‌తో ‘వీక్ సిగ్నల్’ సమస్యను సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఇందులో గల స్మార్ట్ యాంటెనా అల్గారిథమ్ (అప్ అండ్ డౌన్ స్విచింగ్, లెఫ్ట్ అండ్ రైట్ స్విచింగ్, ల్యాండ్‌స్కేప్ అండ్ పోర్ట్రయిట్ స్విచింగ్)తో మీరు అంతరాయం లేని నెట్‌వర్క్ అనుభవాన్ని పొందవచ్చు.

OPPO F11 Pro Review, OPPO F11 Pro price in india, best smartphone under Rs.25000, OPPO F11 Pro features, OPPO F11 Pro camera, oppo f11 pro, oppo f11 pro camera, oppo f11 pro camera test, oppo f11 pro vs, ఒప్పో ఎఫ్11 ప్రో రివ్యూ, ఒప్పో ఎఫ్11 ప్రో ధర, ఒప్పో ఎఫ్11 ప్రో ఫీచర్స్, ఒప్పో ఎఫ్11 ప్రో కెమెరా, ఒప్పో ఎఫ్11 ప్రో స్పెసిఫికేషన్స్, రూ.25000 లోపు స్మార్ట్‌ఫోన్
image: Oppo

6. అందుబాటు ధర: ‘అందుబాటుతో నాణ్యత’ను అందించడం ద్వారా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో రూ. 25,000 లోపు ఆకట్టుకునే హ్యాండ్‌సెట్ కొరతను OPPO అధిగమించగలిగింది. ప్రీమియం డిజైన్, 48 ఎంపీ కేమెరా, మోటరైజ్డ్ రైజింగ్ కెమెరా, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌లతో OPPO F11 Pro నిస్సందేహంగా బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలవడం విశేషం. ఈ ఫోన్‌ను మీరు రూ.25,000 లోపు కొనొచ్చు. మీ జేబులు ఖాళీ కాకుండా విలాసవంతమైన హై గ్రేడ్ ఎక్స్‌పీరియన్స్‌ను సొంతం చేసుకోవచ్చు.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

Flipkart Super Cooling Days: ఏసీ, ఫ్రిజ్, కూలర్లపై 65% వరకు తగ్గింపు

Zomato: జొమాటోలో ఒక్క రెస్టారెంట్‌కే రోజూ 2,000 బిర్యానీ ఆర్డర్స్

Air India Jobs: ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగం... రూ.41,000 జీతం... నేరుగా ఇంటర్వ్యూ
First published: April 11, 2019, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading