హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OPPO Enco R Pro: ఒప్పో నుంచి మరో కొత్త ఇయర్ బడ్స్.. మార్కెట్లోకి ఎన్కో R ప్రో ఇయర్​ బడ్స్​ లాంచ్..

OPPO Enco R Pro: ఒప్పో నుంచి మరో కొత్త ఇయర్ బడ్స్.. మార్కెట్లోకి ఎన్కో R ప్రో ఇయర్​ బడ్స్​ లాంచ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒప్పో తన ఎస్కో సిరీస్ నుంచి మరో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌​ లాంచ్ చేసింది. ఒప్పో ఎన్కో ఆర్ ప్రో (OPPO Enco R Pro) టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌​ పేరుతో వీటిని చైనాలో రిలీజ్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ ఒప్పో ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ మార్కెట్​లో విస్తరిస్తోంది. కేవలం స్మార్ట్ ​ఫోన్లనే కాదు ఇయర్‌బడ్స్‌ కూడా లాంచ్ చేస్తూ టెక్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. తాజాగా ఒప్పో తన ఎస్కో సిరీస్ నుంచి మరో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌​ లాంచ్ చేసింది. ఒప్పో ఎన్కో ఆర్ ప్రో (OPPO Enco R Pro) టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌​ పేరుతో వీటిని చైనాలో రిలీజ్ చేసింది. బడ్జెట్ ధరలోనే విడుదలైన ఈ డివైజ్‌​లో ప్రీమియం ఫీచర్లను అందించింది. ఎన్కో ఆర్ ప్రో ధర, ఫీచర్లను పరిశీలిద్దాం.

స్పెసిఫికేషన్లు

ఒప్పో ఎన్కో R ప్రో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే తాజాగా విడుదలైన ఇయర్‌బడ్స్‌ భిన్నమైన డిజైన్‌తో వచ్చాయి. ఇవి ఇన్-ఇయర్ సిలికాన్ టిప్స్‌​తో వస్తాయి. అయితే, స్టాండర్డ్ మోడల్‌లో మాత్రం సిలికాన్ టిప్‌​ను అందించలేదు. ఎన్కో R ప్రో TWS ఇయర్‌బడ్స్ 12.4mm డ్రైవర్స్‌తో వస్తాయి. వీటిని బ్లూటూత్ v5.2 ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. కలర్ ఓఎస్ డివైజెస్‌​తో సులభంగా కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు.

ఈ ఇయర్‌బడ్స్‌​లో కాలింగ్ కోసం యాంబియంట్ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, లో లేటెన్సీ గేమింగ్, టచ్ జెస్టర్ కంట్రోల్స్ కూడా చేర్చింది. ఈ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్‌​లో ఉన్నప్పుడు ANC ఆఫ్‌​లో ఉంటుంది. అందువల్ల, 28 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించగలవు.

ధర, లభ్యత

చైనాలో ఒప్పో ఎన్కో R ప్రో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లు CNY 499 (దాదాపు రూ. 5,700) వద్ద విడుదలయ్యాయి. ఈ TWS ఇయర్‌బడ్స్ ప్రీ ఆర్డర్లు ఇప్పటికే చైనాలో ప్రారంభమయ్యాయి. నవంబర్ 24 నుండి ఇవి చైనాలో అందుబాటులోకి వచ్చాయి. అయితే, డెలివరీలు మాత్రం డిసెంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయి.

ఒప్పో రెనో 9 సిరీస్‌పై ఆఫర్లు

కాగా, ఒప్పో ఇటీవల ఆవిష్కరించిన రెనో9 సిరీస్ కొనుగోలుదారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఒప్పో రోనో 9 సిరీస్ కొనుగోలు చేసే వారు ఎన్కో R ప్రో TWS ఇయర్‌బడ్స్‌పై CNY 100 (దాదాపు రూ. 1,100) డిస్కౌంట్ పొందవచ్చు. ఒప్పో ఇటీవలే తన ఫ్లాగ్‌షిప్ రెనో 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ లైనప్‌లో వనిల్లా ఒప్పో రెనో9, రెనో9 ప్రో, రెనో9 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది.

First published:

Tags: Earbuds, Oppo

ఉత్తమ కథలు