Oppo Enco Buds: అతి తక్కువ ధరలో ఒప్పో ఎన్కో ఇయర్​బడ్స్.. అద్భుతమైన ఫీచర్లు.. వివరాలిలా..

ఒప్పో ఇయర్ బడ్స్

కరోనా కాలంలో ఇయర్​బడ్స్​కు(Earbuds) బాగా డిమాండ్(Demand)​ పెరిగింది. దీంతో అన్ని ఎలక్ట్రానిక్​ (Electronic) తయారీ సంస్థలు వీటి తయారీపై దృష్టిసారించాయి. ఇప్పటికే శామ్‌సంగ్(Samsung)​, వన్​ప్లస్(Oneplus)​, రెడ్​మీ(Redme), రియల్​మీ(Real me) వంటి సంస్థలు వరుసగా ఇయర్​బడ్స్​ లాంచ్​ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో ఒప్పో కూడా వరుసగా ఇయర్​బడ్స్ లాంచింగ్​కు సిద్దమవుతోంది. ​

  • Share this:
కరోనా కాలంలో ఇయర్​బడ్స్​కు(Earbuds) బాగా డిమాండ్(Demand)​ పెరిగింది. దీంతో అన్ని ఎలక్ట్రానిక్​ (Electronic) తయారీ సంస్థలు వీటి తయారీపై దృష్టిసారించాయి. ఇప్పటికే శామ్‌సంగ్(Samsung)​, వన్​ప్లస్(Oneplus)​, రెడ్​మీ(Redme), రియల్​మీ(Real me) వంటి సంస్థలు వరుసగా ఇయర్​బడ్స్​ లాంచ్​ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో ఒప్పో కూడా వరుసగా ఇయర్​బడ్స్ లాంచింగ్​కు సిద్దమవుతోంది. ​తాజాగా ఒప్పో భారత మార్కెట్​లోకి ఒప్పో ఎన్కో బడ్స్ పేరుతో​ టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్స్‌ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్​ శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్‌ని పోలి ఉంటాయని తెలిపింది. ఇవి ఇన్-ఇయర్ డిజైన్‌తో వస్తాయని పేర్కొంది.

Ola electric scooters: నేటి నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ప్రారంభం.. ఆన్​లైన్​లో ఇలా కొనుగోలు చేయండి..


ఈ ఎన్కో బడ్స్.. ఒప్పో ఎన్కో W51, ఎన్కో W11, ఎన్కో X పేర్లతో రిలీజ్​ కానున్నాయి. వీటి ధర రూ .1,999 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 14న నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభపు ఆఫర్​ కింద కేవలం రూ .1,799 ధర వద్ద వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒప్పో వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్​ భారతదేశంలో షియోమి, రియల్‌మీ, నాయిస్, బోట్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన బడ్జెట్​ ఇయర్​బడ్స్​కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 6 గంటల బ్యాటరీ బ్యాకప్​..
ఒప్పో ఏప్రిల్​ నెలలోనే వీటిని థాయ్‌లాండ్‌లో విడుదల చేసింది. అచ్చం అవే స్పెసిఫికేషన్లతో ఇప్పుడు భారత్​లోకి లాంచ్​ చేయనుంది. ఇవి క్రిస్టల్​ క్టియర్​ ఆడియో, లాంగ్​ ప్లేబ్యాక్​ టైమ్​ లాంటి ఫీచర్లతో​ విడుదల కానున్నాయి. హెయిర్ బాస్ కోసం వీటిలో ప్రత్యేకంగా​ 8 మి.మీ. డైనమిక్ డ్రైవర్లను అందించనున్నారు. ఇవి 20KHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్​ రేంజ్​ను అందిస్తాయి. అయితే, వీటిలో యాక్టివ్ నాయిస్​ క్యాన్సలేషన్​ను మాత్రం చేర్చలేదు. కాల్స్​ మాట్లాడే సమయంలో ఎటువంటి అంతరాయం లేకుండా చేసే నాయిస్​ రిడక్షన్​ టెక్నాలజీని మాత్రం అందించారు.

Realme Pad: రియల్‌మీ నుంచి తొలి ట్యాబ్లెట్ రిలీజ్... ధర రూ.15,000 లోపే


ఒప్పో బ్యాటరీ లైఫ్​ మీద కూడా ఎక్కువ ఫోకస్​ పెట్టింది. అందుకే, అధిక సామర్థ్యం గల బ్యాటరీని వీటిలో చేర్చింది. దీనిలోని బ్యాటరీ సింగిల్​ చార్జ్​తో 6 గంటల వరకు ప్లేబ్యాక్​ టైమ్​ ఇస్తుంది. ఒకవేళ చార్జింగ్​ కేస్​తో ఇయర్​ బడ్స్​ను ఉపయోగిస్తే.. 24 గంటల వరకు ప్లేబ్యాక్​ టైమ్​ ఉండనుంది. ఈ ఒప్పో ఎన్కో ఇయర్‌బడ్స్ బ్లూటూత్ v5.2 కనెక్టివిటీ గల ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ రన్నింగ్ ఫోన్లలో కూడా సమర్థవంతంగా పనిచేయగలవు. ఒక్కో ఇయర్​ బడ్​లో 40 ఎంఏహెచ్​ బ్యాటరీ, చార్జింగ్​ కేసులో 400 ఎంఏహెచ్​ బ్యాటరీ, యూఎస్​బీ టైప్​ సీ పోర్ట్​, వాటర్​ రెసిస్టెంట్​ వంటి అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. ఇవి కేవలం తెలుపు రంగులోనే అందుబాటులో ఉంటాయి.
Published by:Veera Babu
First published: