డ్యూయెల్ డిస్‌ప్లేతో ఒప్పో ఫోన్!

ఫోన్ వెనుక రెండో డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్ తయారుచేసే పనిలో ఉంది ఒప్పో. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను రెండో స్క్రీన్‌పైకి మార్చనుంది.

news18-telugu
Updated: July 25, 2018, 3:22 PM IST
డ్యూయెల్ డిస్‌ప్లేతో ఒప్పో ఫోన్!
Image: Lets Go Digital
  • Share this:
ఒకప్పుడు ఫోన్‌లో ఒక సిమ్ ఉండేది. ఆ తర్వాత డ్యూయెల్ సిమ్ ఫోన్లు వచ్చాయి. కొన్ని ఫోన్లల్లో మూడు సిమ్ కార్డులు కూడా వాడొచ్చు. ఒకప్పుడు ఫోన్‌లో రియర్ కెమెరా ఉంటే గొప్ప. ఆ తర్వాత సెల్ఫీ కెమెరా వచ్చింది. ఇది చాలదన్నట్టు డ్యూయెల్ రియర్ కెమెరా ఫోన్లొచ్చాయి. ఇప్పుడు ముందు రెండు, వెనుక రెండు కెమెరాలతో ఫోన్లు వస్తున్నాయి. అంతేకాదు... ట్రిపుల్ రియర్ కెమెరా ఫోన్ కూడా ఉంది. ఈమధ్యే పాప్-అప్ కెమెరాతో వచ్చిన ఫోన్ మరో హైలైట్. ఇలా టెక్నాలజీని అప్‌డేట్ చేస్తూ కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు రెండో డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్ రూపొందిస్తోంది ఒప్పో.

ఇలాంటి కొత్త హంగులతో స్మార్ట్‌ఫోన్లు తీసుకొచ్చేందుకు ఒప్పో కొన్ని పేటెంట్స్ కూడా రూపొందించింది. సెకండరీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే అందులో ఒకటి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని సెకండరీ స్క్రీన్‌కు మార్చే అవకాశముంది. ఇక కెమెరా ఫీచర్లన్నీ సెకండరీ స్క్రీన్‌పైనే ఉంటాయి. ఇక రెండు డిస్‌ప్లేల్లో ఒకదాని నుంచి మరోదానికి మారేందుకు ఓ ఐకాన్ ఉంటుంది. ఇందుకు సంపబంధించి ఒప్పో పేటెంట్‌ని వాల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ ఆమోదించింది. అయితే డ్యూయెల్ డిస్‌ప్లే గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

First published: July 25, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>