Oppo Reno 2 Series: ఒప్పో రెనో 2జెడ్, ఒప్పో రెనో 2ఎఫ్ స్మార్ట్ఫోన్లపై రూ.2,000 తగ్గింపు
Oppo Reno 2 Series | ఈ స్మార్ట్‌ఫోన్లల్లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వెనుకవైపు నాలుగు కెమెరాలు, గేమ్ బూస్ట్ 3.0 మోడ్, గేమ్ స్పేస్, 3.5 ఎంఎం జాక్, ఇన్-డిస్ప్లే పింగర్‌ప్రింట్ సెన్సార్, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.
news18-telugu
Updated: November 9, 2019, 3:33 PM IST

Oppo Reno 2 Series: ఒప్పో రెనో 2జెడ్, ఒప్పో రెనో 2ఎఫ్ స్మార్ట్ఫోన్లపై రూ.2,000 తగ్గింపు (image: Oppo)
- News18 Telugu
- Last Updated: November 9, 2019, 3:33 PM IST
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. ఇటీవల ఒప్పో రిలీజ్ చేసిన కొత్త స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గాయి. కొద్దిరోజుల క్రితం ఒప్పో రెనో 2 సిరీస్‌లో మూడు స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఒప్పో రెనో 2, రెనో ఒప్పో 2జెడ్, ఒప్పో రెనో 2ఎఫ్ మోడల్స్‌ని పరిచయం చేసింది కంపెనీ. వీటిలో ఒప్పో రెనో 2జెడ్, ఒప్పో రెనో 2ఎఫ్ మోడల్స్‌పై ఏకంగా రూ.2,000 ధర తగ్గించింది కంపెనీ. రిలీజ్ అయినప్పుడు ఒప్పో రెనో 2ఎఫ్ ధర రూ.25,990 కాగా, ప్రస్తుత ధర రూ.23,990. ఇక ఒప్పో రెనో 2జెడ్ పాత ధర రూ.29,990 కాగా ప్రస్తుత ధర రూ.27,990. ఈ స్మార్ట్‌ఫోన్లల్లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వెనుకవైపు నాలుగు కెమెరాలు, గేమ్ బూస్ట్ 3.0 మోడ్, గేమ్ స్పేస్, 3.5 ఎంఎం జాక్, ఇన్-డిస్ప్లే పింగర్‌ప్రింట్ సెన్సార్, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.
Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ఎలా ఉన్నాయో చూడండి
ఇవి కూడా చదవండి:
Aadhaar-SBI link: మీ ఎస్బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా? ఇలా చేయండి
RBI: గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ... జనవరి నుంచి అమలు
IRCTC: గుడ్ న్యూస్... హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ రామాయణ యాత్ర
రెనో 2జెడ్ | రెనో 2ఎఫ్ | |
డిస్ప్లే | 6.53 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే | 6.53 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే |
ర్యామ్ | 8 జీబీ | 8 జీబీ |
ఇంటర్నల్ స్టోరేజ్ | 256 జీబీ | 128 జీబీ |
ప్రాసెసర్ | మీడియాటెక్ పీ90 | మీడియాటెక్ పీ70 |
రియర్ కెమెరా | 48+8+2+2 మెగాపిక్సెల్ | 48+8+2+2 మెగాపిక్సెల్ |
ఫ్రంట్ కెమెరా | 16 మెగాపిక్సెల్ | 16 మెగాపిక్సెల్ |
బ్యాటరీ | 4000 ఎంఏహెచ్ | 4000 ఎంఏహెచ్ |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 9 పై+కలర్ ఓఎస్ 6 | ఆండ్రాయిడ్ 9 పై+కలర్ ఓఎస్ 6 |
కలర్స్ | ఓషియన్ బ్లూ, ల్యూమినస్ బ్లాక్ | ఓషియన్ బ్లూ, ల్యూమినస్ బ్లాక్ |
ధర | రూ.27,990 | రూ.23,990 |
Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ఎలా ఉన్నాయో చూడండి
ఇవి కూడా చదవండి:
Aadhaar-SBI link: మీ ఎస్బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా? ఇలా చేయండి
RBI: గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ... జనవరి నుంచి అమలు
IRCTC: గుడ్ న్యూస్... హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ రామాయణ యాత్ర