Oppo Reno 2: ఒప్పో నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ఫీచర్స్ ఇవే

Oppo Reno 2 Series | ఒప్పో రెనో 2 సిరీస్‌లో గేమ్ బూస్ట్ 3.0 మోడ్, గేమ్ స్పేస్, 3.5 ఎంఎం జాక్, ఇన్‌-డిస్‌ప్లే పింగర్‌ప్రింట్ సెన్సార్, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: August 28, 2019, 5:23 PM IST
Oppo Reno 2: ఒప్పో నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ఫీచర్స్ ఇవే
Oppo Reno 2: ఒప్పో నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ఫీచర్స్ ఇవే (image: Oppo India)
news18-telugu
Updated: August 28, 2019, 5:23 PM IST
ఇండియన్ మార్కెట్‌లోకి మరో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. ఒప్పో కంపెనీ రెనో సిరీస్‌లో ఒకేరోజు మూడు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. కొన్ని నెలల క్రితమే షార్క్ ఫిన్ పాప్ అప్ కెమెరా, 10X జూమ్‌తో రెనో సిరీస్‌ని ఇండియాకు పరిచయం చేసింది ఒప్పో. ఇప్పుడు రెనో 2 సిరీస్‌ తీసుకొచ్చింది. రెనో 2, రెనో 2జెడ్, రెనో 2ఎఫ్ మోడల్స్‌ని రిలీజ్ చేసింది. ఈ మూడు ఫోన్లల్లో నాలుగు రియర్‌ కెమెరాలు ఉండటం విశేషం. అన్నీ 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్లే. గేమ్ బూస్ట్ 3.0 మోడ్, గేమ్ స్పేస్, 3.5 ఎంఎం జాక్, ఇన్‌-డిస్‌ప్లే పింగర్‌ప్రింట్ సెన్సార్, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెనో 2 ధర రూ.36,990, రెనో 2జెడ్ ధర రూ.29,990 కాగా రెనో 2ఎఫ్ నవంబర్‌లో అందుబాటులోకి రానుంది. అప్పుడే ధర తెలుస్తుంది. రెనో 2జెడ్ సేల్ సెప్టెంబర్ 6న, రెనో 2 సేల్ సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా ఈ ఫోన్లు లభిస్తాయి.




Loading...




































































రెనో 2 రెనో 2జెడ్ రెనో 2ఎఫ్
డిస్‌ప్లే  6.55 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే  6.53 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే  6.53 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే
ర్యామ్  8 జీబీ  8 జీబీ  8 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్  256 జీబీ  256 జీబీ  128 జీబీ
ప్రాసెసర్  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730  మీడియాటెక్ పీ90  మీడియాటెక్ పీ70
రియర్ కెమెరా  48+13+8+2 మెగాపిక్సెల్  48+8+2+2 మెగాపిక్సెల్  48+8+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా  16 మెగాపిక్సెల్  16 మెగాపిక్సెల్  16 మెగాపిక్సెల్
బ్యాటరీ  4000 ఎంఏహెచ్  4000 ఎంఏహెచ్  4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 9 పై+కలర్ ఓఎస్ 6  ఆండ్రాయిడ్ 9 పై+కలర్ ఓఎస్ 6  ఆండ్రాయిడ్ 9 పై+కలర్ ఓఎస్ 6
 కలర్స్  ఓషియన్ బ్లూ, ల్యూమినస్ బ్లాక్  ఓషియన్ బ్లూ, ల్యూమినస్ బ్లాక్  ఓషియన్ బ్లూ, ల్యూమినస్ బ్లాక్
 ధర  రూ.36,990  రూ.29,990  నవంబర్‌లో ప్రకటన

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Realme XT: రియల్‌మీ ఎక్స్‌టీ... 64 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్... తొలిసారి ఇండియాలో రిలీజ్

Smartphone: ఎంఐ ఏ3, రియల్‌మీ 5 ప్రో, మోటోరోలా వన్ యాక్షన్... ఈ మూడు ఫోన్లల్లో ఏది బెటర్?

Samsung: సాంసంగ్ గెలాక్సీ ఏ10ఎస్ రిలీజ్... ధర రూ.9,499
First published: August 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...