ఒప్పో ఇండియా మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను (5G Smartphone) రిలీజ్ చేసింది. ఒప్పో ఏ78 5జీ (Oppo A78 5G) మొబైల్‌ను రిలీజ్ చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, డ్యూయెల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రూ.20,000 లోపు మొబైల్ (Smartphone Under Rs 20000) సెగ్మెంట్‌లో ఒప్పో ఏ78 5జీ రిలీజైంది. ప్రస్తుతం భారతదేశంలో 5జీ మొబైల్స్‌కు డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ భారతదేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో 5జీ నెట్వర్క్ లాంఛ్ చేయడంతో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 5జీ మొబైల్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న యూజర్లను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు కొత్తకొత్త 5జీ మొబైల్స్ లాంఛ్ చేస్తున్నాయి.
ఒప్పో ఏ78 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్లో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మాత్రమే రిలీజైంది. ధర రూ.18,999. జనవరి 18న సేల్ ప్రారంభమవుతుంది. ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో కొనొచ్చు. ప్రీ ఆర్డర్ మొదలైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ, వన్‌కార్డ్, ఏయూ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థల నుంచి 6 నెలల ఈఎంఐతో ఒప్పో ఏ78 5జీ కొనొచ్చు.
Lenovo Tab P11 5G: మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసి ఈ 5జీ ట్యాబ్లెట్ కొనేయండి... రూ.10 వేల లోపే
Leave the lag behind! ????♂️ Get set to experience top-notch performance and superior connectivity with the all-new #OPPOA78 #5G ???? Available from Jan 18 for just Rs 18,999/-. Avail up to 10% Cashback on the leading banks.
— OPPO India (@OPPOIndia) January 16, 2023
ఒప్పో ఏ78 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ, సాంసంగ్ గెలాక్సీ ఎం 13 5జీ, పోకో ఎం4 5జీ లాంటి మొబైల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 13 + కలర్‌ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ కూడా ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
Gmail Full: జీమెయిల్‌లో అవసరంలేని మెయిల్స్ ఒకేసారి డిలిట్ చేయండిలా
ఒప్పో ఏ78 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000mAh భారీ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. SUPERVOOCTM సపోర్ట్ ఉంది. ఈ ఫీచర్‌తో 60 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు. పూర్తిగా ఛార్జ్ చేస్తే 23 గంటలపాటు వాడుకోవచ్చు. టైప్ సీ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. ఒప్పో ఏ78 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ ఉండటం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Oppo, Smartphone