హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oppo A58 5G: మార్కెట్లోకి ఒప్పో A58 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. లేటెస్ట్ మోడల్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

Oppo A58 5G: మార్కెట్లోకి ఒప్పో A58 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. లేటెస్ట్ మోడల్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది చైనీస్ స్మార్ట్ బ్రాండ్ ఒప్పో. ఈ సంస్థ తాజాగా ఒప్పో A58 5G ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

మన దేశంలో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు (Smartphones) ఒకసారి వాడినవారు, ఆ తర్వాత మిడ్‌రేంజ్ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అందుకే ఇండియాలో ఈ సెగ్మెంట్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని మొబైల్ తయారీ సంస్థలు బాగా క్యాష్ చేసుకుంటున్నాయి. చాలా కంపెనీలు రూ.20 వేల ధరలో హై రేంజ్‌ ఫీచర్లను అందిస్తున్నాయి. అయితే తాజాగా మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది చైనీస్ స్మార్ట్ బ్రాండ్ ఒప్పో (Oppo). ఈ సంస్థ తాజాగా ఒప్పో A58 5G ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లే, ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌, డ్యుయల్ మోడ్ 5G సపోర్ట్, 50 MP డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ.. వంటి ఫీచర్లతో ఫోన్ రిలీజ్ అయింది. ఈ మిడ్ రేంజ్ హ్యాండ్‌సెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం.

ఫీచర్లు

ఒప్పో A58 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 90Hz వరకు రిఫ్రెష్ రేట్‌ ఉండే 6.56 అంగుళాల HD+ (720X1,612 పిక్సెల్స్) డిస్‌ప్లే, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌.. యూజర్లకు బెస్ట్ అవుట్‌పుట్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 163.8x75.04x7.99mm కొలతలతో 188g బరువు ఉంటుంది. ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది 8.5 గంటల గేమింగ్ టైమ్‌ను అందిస్తుంది.

కెమెరా కెపాసిటీ

ఒప్పో A5G 5G ఫోన్‌లో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇందులో f/1.8 ఎపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2 MP పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం f/2.0 ఎపర్చర్‌తో 8 MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ కెమెరాలు 30fps వద్ద ఫుల్-HD వీడియోలను రికార్డ్ చేయగలవని కంపెనీ తెలిపింది.

ధర ఎంత?

ఒప్పో A58 5G ఫోన్‌ ప్రీ బుకింగ్స్ చైనాలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీని సేల్స్ చైనాలో నవంబర్ 10వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమవుతాయి. ఇది 8 GB RAM, 256 GB ROM వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. చైనాలో దీని ధర CNY 1.699 (సుమారు రూ. 19,000)గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్టార్ బ్లాక్, బ్రీజ్ పర్పుల్, ట్రాంక్విల్ సీ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇతర దేశాల్లో రిలీజ్ చేసే విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

First published:

Tags: 5G Smartphone, Oppo, Smartphone

ఉత్తమ కథలు