Oppo A56 5G: ఒప్పో A56 5జీ మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​ రిలీజ్... అద్భుతమైన కెమెరా, బ్యాటరీ బ్యాకప్

Oppo A56 5G: ఒప్పో A56 5జీ మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​ రిలీజ్... అద్భుతమైన కెమెరా, బ్యాటరీ బ్యాకప్

Oppo A56 5G | ఒప్పో నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఒప్పో ఏ56 5జీ మోడల్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ ఒప్పో వరుసగా స్మార్ట్​ఫోన్లు (Oppo Smartphones) విడుదల చేస్తూ మార్కెట్​ను విస్తరిస్తోంది. తాజాగా ఒప్పో తన A సిరీస్​లో ఒప్పో A56 5G (Oppo A56 5G) మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​ను చైనా మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. ఈ మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​లో డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ వంటివి అందించింది. ఒప్పో A56 5G మీడియాటెక్​ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. దీని ధర, ఫీచర్లను పరిశీలిద్దాం.

ఒప్పో A56 5జీ ధర, లభ్యత


కొత్త ఒప్పో A56 5G చైనా మార్కెట్​లోకి సింగిల్​ వేరియంట్​లో విడుదలైంది. దీని 6 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​ CNY 1,599 (దాదాపు రూ. 18,800) వద్ద లభిస్తుంది. ఇది క్లౌడ్ స్మోక్ బ్లూ, సాఫ్ట్ ఫాగ్ బ్లాక్, విండ్ చిమ్ పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఒప్పో A56 5G ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్ల కోసం సిద్ధంగా ఉంది.

Flipkart Big Diwal Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ మొదలైన సేల్... రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

ఒప్పో A56 5G స్పెసిఫికేషన్లు


ఒప్పో A56 5G ఆండ్రాయిడ్​ 11-ఆధారిత కలర్​ ఓస్​ 11.1పై నడుస్తుంది. ఇది 6.5 -అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో వస్తుంది. ఇది మీడియా టెక్​ డైమెన్సిటీ 700 ఆక్టా-కోర్ ఎస్​ఓసీ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో మాలి -G57 MC2 జీపీయూ చిప్​సెట్​ను అందించింది.​ ఇక, దీనిలో 128 జీబీ స్టోరేజ్​ను అందించగా.. SDXC కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజ్​ను మరింత విస్తరించుకునే అవకాశం ఉంది.

iQOO 7 5G: రూ.29,990 విలువైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.8,000 లోపే... ఆఫర్ మరో వారమే

ఇక, కెమెరా విషయానికొస్తే, ఒప్పో A56 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరాలను చేర్చింది. దీని వెనుక భాగంలో నైట్ సీన్ మోడ్, వీడియో, పోర్ట్రెయిట్, స్లో మోషన్, టైమ్-లాప్స్ వంటి కెమెరాలను అందించింది. ముందు భాగంలో, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చేర్చింది. ఒప్పో A56 5G స్మార్ట్​ఫోన్​ 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఫేస్ అన్‌లాక్‌కు కూడా మద్దతిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్‌లు, యూఎస్​బీ టైప్-సి పోర్ట్, బ్లూటూత్ v5.1, వైఫై 5, 3.5mm ఆడియో జాక్, జీపీఎస్​ వంటివి అందించింది.
Published by:Santhosh Kumar S
First published: