• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • OPPO A55 5G LAUNCHED WITH MEDIATEK DIMENSITY 700 PROCESSOR AND 5000MAH BATTERY KNOW SPECIFICATIONS SS

Oppo A55 5G: ఒప్పో ఏ55 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఈ 5జీ ఫోన్ ప్రత్యేకతలివే

Oppo A55 5G: ఒప్పో ఏ55 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఈ 5జీ ఫోన్ ప్రత్యేకతలివే

Oppo A55 5G: ఒప్పో ఏ55 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఈ 5జీ ఫోన్ ప్రత్యేకతలివే (image: Oppo)

Oppo A55 5G | ఒప్పో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

  • Share this:
    ఇది 5జీ యుగం. 4జీ ఔట్‌డేటెడ్ కావడానికి ఇంకొన్ని రోజులే ఉంది. ఇండియాలో 5జీ నెట్వర్క్ వచ్చేస్తే 4జీ గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లోకి 5జీ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఒప్పో ఏ55 5జీ పేరుతో కొత్త మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే రిలీజ్ అయింది. ఇతర దేశాల్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్, ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. కెమెరాలో నైట్ సీన్, ప్రొఫెషనల్, ప్యానరమిక్, పోర్ట్‌రైట్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, సూపర్ టెక్స్ట్‌, అల్‌ట్రా క్లియర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఒప్పో ఏ55 5జీ ధర 1,599 చైనీస్ యువాన్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ధర రూ.18,000 ఉంటుంది. కానీ ఇండియాలో అంతకన్నా తక్కువ ధరకే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా తెలియదు. ఇండియాలో రిలీజ్ అయినా ఇక్కడ ఇంకా 5జీ నెట్వర్క్ అందుబాటులో లేదు.

    Jio New Plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

    LG K42: ఎల్‌జీ కే42 స్మార్ట్‌ఫోన్ సేల్ ఈరోజే... రెండేళ్ల వారెంటీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు

    ఒప్పో ఏ55 5జీ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700
    రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా + 2 మెగాపిక్సెల్ పోర్ట్‌రైట్ కెమెరా
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + కలర్ ఓఎస్ 11
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్
    కలర్స్: బ్రిస్క్ బ్లూ, రిథమ్ బ్లాక్
    ధర: సుమారు రూ.18,000
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు