Oppo A54: ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు

Oppo A54: ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు

Oppo A54 | ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి పరిచయమైంది. ఒప్పో ఏ54 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఒప్పో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఒప్పో మరో స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇండోనేషియా మార్కెట్‌లో ఒప్పో ఏ54 మోడల్‌ను రిలీజ్ చేసింది. గతేడాది ఆగస్ట్‌లో రిలీజ్ అయిన ఒప్పో ఏ53 అప్‌గ్రేడ్ మోడల్ ఇది. ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. బ్యాటరీలో ఓవర్‌నైట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. రాత్రి సమయంలో ఛార్జింగ్ పెట్టినా బ్యాటరీ ఫుల్ కాగానే ఛార్జింగ్ ఆగిపోతుంది. ఓవర్ ఛార్జ్ కాదు. కేవలం 4జీబీ+128జీబీ వేరియంట్‌లో మాత్రమే ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం ధర రూ.13,600 ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియా మార్కెట్‌లో రిలీజ్ అయింది. మరి ఇండియన్ మార్కెట్‌లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు. ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ అయితే పోకో ఎం3, రియల్‌మీ 7, సాంసంగ్ గెలాక్సీ ఎం12, రెడ్‌మీ 10 లాంటి మోడల్స్‌కు పోటీ తప్పదు. ఇక ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్ 4జీ మోడల్ మాత్రమే. ఒప్పో ఏ54 5జీ మోడల్ కూడా వార్తల్లో ఉంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు.

    Poco X3 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎక్స్3 ప్రో వచ్చేసింది... ధర ఎంతంటే

    Poco M3: నిమిషానికి 8 ఫోన్లు అమ్మిన పోకో ఇండియా... ఈ ఫోన్ ఎందుకంత స్పెషల్?

    ఒప్పో ఏ54 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.51 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 4జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ35
    రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + కలర్ ఓఎస్ 7.2
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: క్రిస్టల్ బ్లాక్, స్టారీ బ్లూ
    ధర: సుమారు రూ.13,600
    Published by:Santhosh Kumar S
    First published: