• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • OPPO A54 LAUNCHED IN INDIA WITH MEDIATEK HELIO P35 PROCESSOR AND 5000MAH BATTERY KNOW PRICE AND SPECIFICATIONS SS

Oppo A54: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ54... ధర ఎంతంటే

Oppo A54: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ54... ధర ఎంతంటే

Oppo A54: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ54... ధర ఎంతంటే (image: Oppo India)

Oppo A54 | రూ.15,000 లోపు బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఒప్పో ఏ54 మోడల్‌ను ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు పరిచయం చేసింది ఒప్పో ఇండియా. కొన్ని రోజులుగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లీక్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఒప్పో ఏ54 రిలీజ్ కావడంతో ఫీచర్స్ తెలిసిపోయాయి. ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రియర్ కెమెరాలో స్లోమో ఫీచర్, 10 వరకు వీడియో ఫిల్టర్స్ ఉన్నాయి. రూ.15,000 లోపు సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఒప్పో ఏ54 ప్రారంభ ధర రూ.13,490. ఇది 4జీబీ+64జీబీ వేరియంట్ ధర. ఇక 4జీబీ+128జీబీ ధర రూ.14,490 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.15,990.

    ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రీటైల్ ఔట్‌లెట్స్‌లో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో, క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో కొనేవారికి రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం ఒప్పో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారు అప్‌గ్రేడ్ చేసుకుంటే రూ.1,000 అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒప్పో ఏ54 సేల్ ఏప్రిల్ 20న మొదలవుతుంది.

    WhatsApp: వాట్సప్ వాడేవాళ్లు అస్సలు ఈ తప్పులు చేయొద్దు

    Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా


    ఒప్పో ఏ54 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
    ర్యామ్: 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ ప్రాసెసర్
    రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + కలర్‌ఓఎస్ 7.2
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: క్రిస్టల్ బ్లాక్, స్టారీ బ్లూ, మూన్‌లైట్ గోల్డ్
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.13,490
    4జీబీ+128జీబీ- రూ.14,490
    6జీబీ+128జీబీ- రూ.15,990

    LG Wing: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,000 తగ్గింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే

    WhatsApp Privacy Policy: మే 15 డెడ్‌లైన్... వాట్సప్ ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఏమవుతుందో తెలుసా?

    ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రూ.15,000 లోపు సెగ్మెంట్‌లో షావోమీ, రియల్‌మీ, పోకో ఇండియా, సాంసంగ్ నుంచి పాపులర్ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 10, రియల్‌మీ 8, రియల్‌మీ 7, పోకో ఎక్స్3, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41, సాంసంగ్ గెలాక్సీ ఎం12 లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు