ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ5!

ఒప్పో ఏ5 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. ధర రూ. 14,990.

news18-telugu
Updated: August 23, 2018, 3:38 PM IST
ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ5!
ఒప్పో ఏ5 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. ధర రూ. 14,990.
  • Share this:
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో ఇండియాలో మరో ఫోన్‌ని లాంఛ్ చేసింది. ఒప్పో ఏ5 నాచ్ డిస్‌ప్లేతో రావడం విశేషం. ఈ ఫోన్‌ని జూలైలోనే చైనాలో రిలీజ్ చేశారు. నెల రోజుల తర్వాత ఇండియాకు తీసుకొచ్చారు. దేశంలోని అన్ని మొబైల్ స్టోర్లల్లో ఈ ఫోన్ లభిస్తుంది. 6.2 అంగుళాల అతిపెద్ద డిస్‌ప్లో ఈ ఫోన్ ప్రత్యేకత. ఆండ్రాయిడ్ ఓరియోతో పాటు ఒప్పో కంపెనీకి చెందిన కలర్ ఓఎస్ 5.1తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోవడం పెద్ద లోటే. కానీ ఫేస్ అన్‌‌లాక్ ఫీచర్ ఉంది.

ఒప్పో ఏ5 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.2 అంగుళాల హెచ్‌డీ+, 1520×720 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,320 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, కలర్ ఓఎస్ 5.1
ధర: రూ.14,990
First published: August 23, 2018, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading