నాచ్ స్క్రీన్‌తో ఒప్పో ఏ5: ఫోటోలు లీక్!

ఒప్పో ఏ5 స్మార్ట్‌ఫోన్ ఫోటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. 6.2 అంగుళాల నాచ్ డిస్‌ప్లే, ప్రంట్ కెమెరా, ఇయర్ పీస్, సెన్సార్లతో ఈ డివైజ్ మార్కెట్లోకి రానుంది.

news18-telugu
Updated: June 29, 2018, 10:02 AM IST
నాచ్ స్క్రీన్‌తో ఒప్పో ఏ5: ఫోటోలు లీక్!
Oppo A5. (Photo: http://www.mtksj.com)
  • Share this:
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో ఏ5 పేరుతో మిడ్ రేంజ్ ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఒప్పో ఏ3తో పోలిస్తే స్పెసిఫికేషన్స్ భిన్నంగా ఉన్నాయి. MTKSJ.com రిపోర్ట్ ప్రకారం... ఒప్పో ఏ5 క్వాల్కమ్ చిప్‌సెట్, డ్యూయెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, ఇయర్ పీస్, సెన్సార్లు, 6.2 ఇంచ్ నాచ్ డిస్‌ప్లే, హెచ్‌డీ స్క్రీన్ రెజల్యూషన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.  ఇప్పటి వరకు లీకైన సమాచారం ప్రకారం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 చిప్‌సెట్, డ్యూయెల్ కెమెరా(13+2 మెగాపిక్సెల్), ఫేస్‌లాక్ లేదా బయోమెట్రిక్ సెక్యూరిటీ సిస్టమ్ ఉండనున్నాయి. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓస్‌తో ఒప్పో ఏ5 వచ్చే అవకాశముంది.

First published: June 29, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు